Daily Horoscope 18/08/2022
ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు
18, ఆగష్టు, 2022
స్వస్తి శ్రీ చాన్ద్రమాన శుభకృత్ నామ సంవత్సరమ్
దక్షిణాయణము
వర్ష ఋతువు
శ్రావణ మాసము
కృష్ణ సప్తమి
బృహస్పతి వాసరే (గురు వారం)
రాజతే పృధివీ సర్వాసతతం వివిధోత్సవైః l శుభకృద్వత్సరే వృద్ధిః ప్రజానాం పశుభిస్సహ ll

రాశి ఫలాలు
మేషం
ఈరోజు
బాగా కష్టపడాల్సిన సమయం ఇది. మీ మీ రంగాల్లో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అవగాహన వచ్చిన తరువాతే పనులను ప్రారంభించాలి. లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టు వదలకండి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. విందు,వినోదాల్లో పాల్గొంటారు.
ఇష్టదైవారాధన శుభప్రదం
వృషభం
ఈరోజు
చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. అలసట పెరగకుండా చూసుకోవాలి. శత్రువుల విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాలి.
లక్ష్మీస్తుతి శుభాన్ని చేకూరుస్తుంది
మిధునం
ఈరోజు
శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. గొప్ప భవిష్యత్తు కోసం మంచి ఆలోచనలు చేస్తారు. కుటుంబ సభ్యులకు శుభకాలం. కీలక సమయాల్లో ధైర్యంగా వ్యవహరిస్తారు. అనవసర విషయాల గురించి ఎక్కువ సమయాన్ని వెచ్చించకండి.
శివారాధన శుభప్రదం
కర్కాటకం
ఈరోజు
ఆశయాలు నెరవేరుతాయి. సమయానికి బుద్ధిబలం పనిచేస్తుంది. కుటుంబసభ్యుల మాటకు విలువ ఇవ్వండి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది. సమాజంలో కీర్తి పెరుగుతుంది. అవసరానికి తగ్గట్టు ముందుకు సాగడం మేలు.
శివారాధన శుభకరం
సింహం
ఈరోజు
ప్రగతి సాధిస్తారు. ముఖ్యమైన లావాదేవీల్లో సొంతనిర్ణయాలు వికటిస్తాయి. కొందరి ప్రవర్తన కారణంగా ఆటంకాలు ఎదురవుతాయి. చెడు తలంపులు వద్దు. కీలక విషయాల్లో నిపుణులను సంప్రదించడం మంచిది. ప్రశాంతంగా ఆలోచించడం మంచిది.
విష్ణు సందర్శనం శుభప్రదం
కన్య
ఈరోజు
మధ్యమ ఫలితాలు ఉన్నాయి. అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. బంధు,మిత్రులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఒక సంఘటన మనస్తాపాన్ని కలిగిస్తుంది.
ఎలాంటి పరిస్థితులలోనూ దైవారాధన మానవద్దు
తుల
ఈరోజు
చేపట్టిన కార్యక్రమాలను మనోబలంతో పూర్తిచేస్తారు. ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో ప్రోత్సాహకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. గోసేవ చేయడం మంచిది
వృశ్చికం
ఈరోజు
శుభకాలం. విజయసిద్ధి ఉంది. ధర్మసిద్ధి ఉంది. కీలక వ్యవహారాల విషయంలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తిచేయగలుగుతారు. కొన్ని చర్చలు మీకు లాభిస్తాయి.
ప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి
ధనుస్సు
ఈరోజు
మిశ్రమ కాలం. మనోబలాన్ని కోల్పోవద్దు. మంచి పనులు తలపెడతారు. అనవసర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ వాతావరణం అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. శారీరక శ్రమ పెరుగుతుంది.
శనిధ్యానం శుభప్రదం
మకరం
ఈరోజు
గ్రహబలం తక్కువగా ఉంది. ముఖ్య వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి. మంచి చేయబోతే చెడు అవుతుంది. అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణాల్లో జాగ్రత్త.
దుర్గాస్తోత్రం చదవాలి
కుంభం
ఈరోజు
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో మంచి ఫలితాలు ఉన్నాయి. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది సరైన సమయం. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. బంధు,మిత్రుల ఆదరణ ఉంటుంది. దైవారాధన మానవద్దు
మీనం
ఈరోజు
ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేలకు పూర్తిచేయగలుగుతారు. బాధ్యతలు పెరుగుతాయి. ఇబ్బంది పెట్టాలని చూసేవారి ప్రయత్నాలు వృథా ప్రయాసలే అవుతాయి. వ్యాపారంలో ఆర్ధికంగా ఎదుగుతారు.
లింగాష్టకం చదవాలి
Panchangam
ఓం శ్రీ గురుభ్యోనమః
ఆగష్టు 18, 2022
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయణం
వర్ష ఋతువు
శ్రావణ మాసం
కృష్ణ పక్షం
తిథి: సప్తమి రా12.18
వారం: బృహస్పతివాసరే
(గురువారం)
నక్షత్రం: భరణి తె3.23
యోగం: వృద్ధి రా1.20
కరణం: భద్ర మ12.10
&
బవ రా12.18
వర్జ్యం: రా12.22-2.02
దుర్ముహూర్తం: ఉ9.57-10.48
&
మ2.59-3.50
అమృతకాలం: రా10.23-12.03
రాహుకాలం: మ1.30-3.00
యమగండం: ఉ6.00-7.30
సూర్యరాశి: సింహం
చంద్రరాశి: మేషం
సూర్యోదయం: 5.46
సూర్యాస్తమయం: 6.23