
In this category I will provide you with all Telugu poems that will teach you the meaning of life. Hope you like this Thank you

Subhashitam – సుభాషితమ్
Subhashitam – సుభాషితమ్ సుభాషితమ్ శ్లో𝕝𝕝 సతతం పరహితవృత్తి ర్భవతు సదా సత్యధర్మ మార్గే ప్రీతిః సర్వత్ర సంపదాం వృద్ధిః సోదర సద్భావనాస్తు లోకే సతతమ్. తా𝕝𝕝 ఎల్లపుడూ ఇతరులకు మేలు చేయాలనే ఆలోచన, మానవ ధర్మాన్నీ, సత్యభాషణను అనుసరిస్తూ, అంతటా సంపదల వృద్ధీ, సోదరభావంతో మెలిగే సద్బుద్ధీ అందరికీ కలుగుగాక. సుభాషితమ్ శ్లో𝕝𝕝 తృణం బ్రహ్మవిదః స్వర్గః తృణం శూరస్య జీవనమ్। జితాక్షస్య తృణం నారీ నిఃస్పృహస్య తృణం జగత్॥ — సూక్తిసుధానిధిః — తా𝕝𝕝…
Keep readingSubhashitam – సుభాషితమ్
Subhashitam – సుభాషితమ్ శ్లో𝕝𝕝 మన్త్రే తీర్థే ద్విజే దేవే దైవఙ్ఞే భేషజే గురౌ। యాదృశీ భావనా యస్య తస్య సిద్ధిర్భవతి తాదృశీ॥ తా𝕝𝕝 “మంత్రములోనైనా, పుణ్యక్షేత్ర విషయములోనైనా, బ్రాహ్మణుడి యందైనా, దేవుడి యందైనా, జ్యోతిష్కుడి యందైనా, ఔషధ విషయములోనైనా, గురువు విషయములోనైనా ఎవడికి ఎలాంటి భావన (భక్తిశ్రద్ధాదికమ్) ఎంత ఉంటే అంతే సిద్ధి కలుగుతుంది.”! సుభాషితమ్ శ్లో𝕝𝕝 శ్రుతిస్మృతీ ఉభే నేత్రే ద్విజస్య పరికీర్తితే। ఏకేన హీనః కాణః స్యాత్ ద్వాభ్యామన్ధః ప్రజాయతే॥ – సూక్తిసుధానిధిః…
Keep reading
Subhashitam – సుభాషితమ్ :
Subhashitam – సుభాషితమ్ శ్లో𝕝𝕝 స్వధీతస్య సుయుద్ధస్య సుకృతస్య చ కర్మణౌ| తపసశ్చ సుతప్తస్య తస్యాన్తే సుఖమేధతే|| తా𝕝𝕝 “కష్టపడి నేర్చుకున్న విద్య, నేర్పుగా చేసిన యుద్ధం, శ్రద్ధాసక్తులతో జాగ్రత్తగా చేసిన పని, నియమనిష్టలతో చేసిన పూజ గొప్ప ఫలితాన్ని ఇస్తాయి. కనుక మంచి ఫలితం రావాలంటే ఎప్పుడూ జాగ్రత్తగా పనిచేయాలి”.! సుభాషితమ్ శ్లో𝕝𝕝 శశిదివాకరయోర్గ్రహపీడనం గజభుజంగమవిహంగమబంధనం మతిమతాం చ విలోక్య దరిద్రతాం విధిరహో! బలవానితి మే మతిః|| …. భర్తృహరిః …. తా𝕝𝕝 “ఏనుగులు, పాములు,…
Keep readingSubhashitam – సుభాషితమ్
Subhashitam – సుభాషితమ్ సుభాషితమ్ శ్లో𝕝𝕝 విషం కుపఠితా విద్యా విషం వ్యాధిరనౌషధమ్। విషం వ్యాధిర్ద్రరిద్రస్య వృద్ధస్య తరుణీ విషమ్॥ తా𝕝𝕝 “సరిగా నేర్చుకొనని విద్య విషం. ఔషధం లేని వ్యాధి విషం. దరిద్రుడికి వ్యాధి విషం. వృద్ధుడికి యువతి విషం.”! సుభాషితమ్ శ్లో𝕝𝕝 అవిద్యాయామన్తరే వర్తమానాః స్వయం ధీరాః పణ్డితం మన్యమానాఃl దన్ద్రమ్యమాణాః పరియన్తి మూఢాః అన్ధేనైవ నీయమానాః యథాన్ధాఃll తా𝕝𝕝 “మూఢులు అవిద్యారూపమైన సంసారములో కొట్టుమిట్టాడుచున్ననూ తామే ధీరులమని, పండితులమని భావిస్తూ జననమరణరూపమైన ఈ…
Keep reading
Subhashitam – సుభాషితమ్ :
Subhashitam – సుభాషితమ్ సుభాషితమ్ శ్లో𝕝𝕝 నలికాగతమపి కుటిలం న భవతి సరలం శునఃపుచ్ఛమ్। తద్వత్ఖలహృదయం బోధితమపి నైవ యాతి మాధుర్యమ్॥ తా𝕝𝕝 “కుక్కతోకను గొట్టంలో ఉంచి బంధించిననూ అది తిన్నగా అవదు. అట్లే ఎంత బోధించిననూ దుర్మార్గుల మనస్సు మంచితనాన్ని పొందదు.! సుభాషితమ్ శ్లో𝕝𝕝 యోసహస్సం సహస్సేన సజ్గామే మానుసేజనే ఏకంచ జేయ్యమత్తా నం సవేసజ్గా మజుత్తమో || తా𝕝𝕝 యుద్ధం లో వేయి మంది శత్రు సేనలను సంహరించడం కంటే తనను తాను జయించిన…
Keep reading
Introducing Verses – చమత్కార పద్యం
Introducing Verses – చమత్కార పద్యం చమత్కార పద్యం రెంటాల సాంబశివరావు గారికి నమస్కృతులతో… యస్తే దదాతి రవ మస్య వరం దదాసి యో వా మదం వహతి తస్య దమం విధత్సే। ఇత్యక్షర ద్వయ విపర్యయ కేళి శీల! కిం నామ కుర్వతి నమో న మనః కరోషి।। ఈ శ్లోకం లో అక్షరద్వయం విపర్యం అవడం గమనించండి… యః-ఎవ్వడైతే, తే- నీకు, రవం-ధ్వనిని, దదాతి- ఇస్తాడో, తస్య-వానికి,(రావణునికి), వరం-వరాన్ని, దదాసి- ఇస్తావు. యః వా-ఎవ్వడైతే,…
Keep reading
Subhashitam – సుభాషితమ్
Subhashitam – సుభాషితమ్ శ్లో𝕝𝕝 నవరాత్రి సమారాధ్యాం నవచక్ర నివాసినీం నవరూప ధరాం దేవీం, నవదుర్గాముపాశ్రయే!! తా𝕝𝕝 నవరాత్రులలో ఆరాధింపదగినది, (శ్రీ చక్రం లోని) నవచక్రాలలో నివసించేది, శక్తి రూపిణి, అయిన నవదుర్గను ఆశ్రయిస్తున్నాను. సుభాషితమ్ శ్లో𝕝𝕝 స్త్రియాం రోచమానాయాం సర్వం తద్రోచతే కులమ్। తస్యాం త్వరోచ్యమానాయాం సర్వమేవ న రోచతే॥ తా𝕝𝕝 స్త్రీ ప్రసన్నచిత్తముతో ఉన్నప్పుడే కుటుంబమైనా, వంశమైనా సంతోషముగా ఉంటుంది. ఆమె ప్రసన్నముగా లేనిచో కుటుంబముగానీ వంశముగానీ ఏదీ సంతోషముగా ఉండరు. అందువల్ల స్త్రీని…
Keep reading
Dhasharathi sathakam – ధాశరథీ శతకం
Dhasharathi sathakam – ధాశరథీ శతకం కర మనురక్తి మందరము గవ్వముగా, నహిరాజు ద్రాడుగా దొరకొని దేవదానవులు దుగ్థపయోధి మథించుచున్నచో ధరణి చలింప లోకములు తల్లడ మందఁగఁగూర్మమై ధరా ధరము ధరించి తీవెకద దాశరథీ కరుణాపయోనిధీ! తాత్పర్యం: రామా! దేవతలను,రాక్షసులను, వైరములతో కూడి మందర పర్వతమును కవ్వముగాను, సర్వరాజగు వాసుకిని కవ్వపు త్రాడుగాను చేసి పాల సముద్రమును చిలుకుచుండగా, అపుడా కొండ తటాలున మునుగుట చేత భూమి, లోకములు తల్లడిల్లటం చూచి కూర్మావతారం యెత్తి కొండను వీపుమీద దాల్చిన…
Keep reading
Sumati sathakam – సుమతీ శతకం
Sumati sathakam – సుమతీ శతకం ధనపతి సఖుఁడై యుండియు నెనయంగా శివుఁడు భిక్షమెత్తఁగవలసెన్ దనవారి కెంతకలిఁగిన దనభాగ్యమె తనఁకుగాగ తథ్యము సుమతీ! తాత్పర్యం: ఓ సుమతీ! ధనమునకు పతియగు కుబేరుడు తనకు స్నేహితుడైనప్పటికినీ, శివుడు భిక్షము ఎత్తవలసి వచ్చినది కదా! అలాగే తనకు సంబంధించిన వారికి ఎంత ధనమున్ననూ తనకు ఉపయోగపడదు. తన అదృష్టఫలమే తనకు లభించును. పరులకున్న ధనమెన్నటికినీ రాదనీ భావం. పెట్టిన దినములలోపల నట్టడవులకైన వచ్చు నానార్థములున్ బెట్టని దినములఁగనకఁపు గట్టెక్కిన నేమిలేదు…
Keep readingVemana sathakam-వేమన శతకం
Vemana sathakam-వేమన శతకం అలను బుగ్గపుట్టినప్పుడే క్షయమౌను గలను గాంచు లక్ష్మిఁగనుటలేదు ఇలను భోగభాగ్యమీతీరు గాదొకో విశ్వదాభిరామ! వినుర వేమ! తాత్పర్యం: సముద్రపు అలలందు బుడగ ఏ విధంగా పుట్టుచూ గిట్టుచూ ఉండునో, అలాగే ఎల్లప్పుడూ భోగభాగ్యములుండవు. ఒకదాని తర్వాత ఒకటి అనుభవించవలసివచ్చుచుండును అని అర్థం. కోతినొనరదెచ్చి కొత్తపట్టముగట్టి కొండముచ్చు లెల్ల గొలిచినట్లు నీతిహీనునొద్ద నిర్భాగ్యులుండుట విశ్వదాభిరామ! వినుర వేమ! తాత్పర్యం: జ్ఞానములేని వానిని తెచ్చి రాజుని చేసిన వాని వద్ద అటువంటివారే మనగలరు. ఎలాగనగా, కోతిని…
Keep readingLoading…
Something went wrong. Please refresh the page and/or try again.