Vaalmiki Ramayanam – 76

Vaalmiki Ramayanam – 76 – రామాయణం — 76 – అప్పుడు భరతుడు శిరస్సున అంజలి ఘటించి రాముడితో ” మా అమ్మ అయిన కైకేయి ఆనాడు రెండు వరాలు అడిగింది. ఇక్ష్వాకు వంశంలో పెద్దవాడిగా పుట్టి, రాజ్యం పొందడానికి సమస్త అర్హతలు కలిగి ఉన్న నువ్వు, తండ్రిని సత్యమునందు నిలబెట్టడం కోసం రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావు. నీ పాదుకలని న్యాసంగా ఇచ్చి నన్ను రాజ్యం చెయ్యమన్నావు. నువ్వు నాకు రాజ్యాన్ని ఎలా ఇచ్చావో, అలాContinue reading “Vaalmiki Ramayanam – 76”

Vaalmiki Ramayanam – 74

Vaalmiki Ramayanam – 74 – రామాయణం – 74 – సీతమ్మ స్నానం చేసి అలంకరించుకున్నాక పరదాలు కట్టిన ఒక పల్లకి ఎక్కించి రాముడి దగ్గరికి తీసుకు వెళ్ళారు. అప్పుడు రాముడి ముఖంలో సంతోషం, దైన్యం, కోపం కనపడ్డాయి. రాముడు ” మీరు ఆవిడని పల్లకిలో ఎందుకు తీసుకొస్తున్నారు. దిగి నడిచి రమ్మనండి ” అన్నాడు. నడిచి వస్తున్న సీతమ్మని చూడడము కోసమని అక్కడున్న వానరములు ఒకరిని ఒకరు తోసుకుంటున్నారు (ఆ వానరములు అప్పటిదాకా సీతమ్మనిContinue reading “Vaalmiki Ramayanam – 74”

Vaalmiki Ramayanam – 73

Vaalmiki Ramayanam – 73 – రామాయణం – 73 – రావణుడు ఆ రణభూమిలో నిహతుడై పడిపోగానే విభీషణుడు ఏడుస్తూ ఆయన దగ్గరికి పరిగెత్తి ” అన్నయ్యా! ఆనాడే నేను నీకు చెప్పాను ‘ యుద్ధానికి వెళ్ళవద్దు, తప్పు చేసింది నువ్వు, నీ తప్పు నువ్వు దిద్దుకో ‘ అన్నాను. కాని నువ్వు నా మాట వినలేదు. ఆ వినకపోవడం వల్ల ఈనాడు ఎలా పడిపోయావో చూడు. ఆ రోజున దర్పముతో ప్రహస్తుడు, ఇంద్రజిత్, కుంభకర్ణుడు,Continue reading “Vaalmiki Ramayanam – 73”

Vaalmiki Ramayanam – 72

Vaalmiki Ramayanam – 72 – రామాయణం – 72 – రావణుడు నల్లటి గుర్రాలు కట్టి ఉన్న తన రథం మీద యుద్ద భూమికి తీవ్రమైన వేగంతో వచ్చాడు. రాముడు ” మాతలి! ప్రతిద్వంది వస్తున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండు. ఎంత మాత్రం పొరబడకు. రథాన్ని కుడి చేతి వైపుకి తీసుకువెళ్ళు. నేను నీకు చెప్పాను అని మరోలా అనుకోవద్దు. నువ్వు ఇంద్రుడికి సారధ్యం చేస్తున్నవాడివి నీకు అన్నీ తెలుసు. నీ మనస్సునందు ధైర్యం ఉండడముContinue reading “Vaalmiki Ramayanam – 72”

Vaalmiki Ramayanam – 71

Vaalmiki Ramayanam – 71 – రామాయణం – 71 – ఇంద్రజిత్ మరణించాడన్న వార్త విన్న రావణుడు కూర్చున్న తల్పం మీదనుండి కిందపడి దీర్ఘమూర్చని పొందాడు. ఆయన ” నా కుమారుడు ఇంద్రజిత్ ఎవరి చేత సంహరింపబడనివాడు ఇవ్వాళ ఇంత దారుణముగా మరణించాడు. ఇంక నాకీ జీవితము ఎందుకు? అసలు ఇన్ని ఉపద్రవాలకి కారణమయిన సీతని సంహరించేస్తాను ” అని ఒక పెద్ద కత్తి పట్టుకుని బయలుదేరాడు. ఆగ్రహముతో తన వైపుకి వస్తున్న రావణుడిని చూసిContinue reading “Vaalmiki Ramayanam – 71”

Vaalmiki Ramayanam – 70

Vaalmiki Ramayanam – 70 –  రామాయణం – 70 – యుద్ధరంగంలోకి రావణుడి కుమారుడైన నరాంతకుడు వచ్చి చాలా భయంకరమైన యుద్ధం చేశాడు. అంగదుడు తన పిడికిలిని బిగించి ఆ నరాంతకుడి తల మీద ఒక దెబ్బ కొట్టేసరికి వాడు తల పగిలి చనిపోయాడు. మహోదరుడిని నీలుడు సంహరించాడు. దేవాంతకుడిని, త్రిశిరుడిని (మూడు తలకాయలతో ఉంటాడు) హనుమంతుడు సంహరించాడు. ఉన్మత్తుడిని గవాక్షుడు సంహరించాడు. అతికాయుడు యుద్ధానికి వచ్చాడు. అప్పుడు రాముడు ” విభీషణా ! అంతContinue reading “Vaalmiki Ramayanam – 70”

Vaalmiki ramaynam -69

Vaalmiki ramaynam -69 – రామాయణం – 69 – రావణుడి ఆజ్ఞ మేరకు నిద్రపోతున్న కుంభకర్ణుడిని నిద్రలేపడానికి ఎందరో సైనికులు ఆయన యొక్క శయనాగారములోకి ప్రవేశించారు. లోపల కుంభకర్ణుడు వింధ్య పర్వతం, మేరు పర్వతం పడుకున్నట్టు పడుకున్నాడు. ఆయన ముక్కు యొక్క రంధ్రములు పెద్ద పర్వత గుహలలా ఉన్నాయి. ఆయన ఊరిపి తీసేసరికి తలుపులు తీసిన వాళ్ళందరూ ఆయన ముక్కులోకి దూరిపోయారు. మళ్ళీ ఆయన ఊపిరి విడిచేసరికి లోపలికి వెళ్ళిన వాళ్ళు అక్కడున్న గోడలకి తలుపులకిContinue reading “Vaalmiki ramaynam -69”

Vaalmiki Ramayanam – 68

Vaalmiki Ramayanam – 68 – రామాయణం – 68 – సుషేణుడు ” పూర్వకాలంలో దేవతలకి రాక్షసులకి గొప్ప యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రాక్షసులు దేవతలని విశేషమైన అస్త్రములతో బాధించారు. ఎందరో దేవతలు ప్రాణాలు విడిచిపెడుతుంటే శరీరాలు దెబ్బతింటుంటే దేవగురువైన బృహస్పతి విశల్యకరణి, సంజీవకరణి, సంధానకరణి అనే ఓషధులు కలిగిన మొక్కలరసం పిండి వాసన చూపిస్తే ఆ దేవతలందరూ మళ్ళీ జీవించారు. ప్రస్తుతం అవి పాల సముద్రములో ఉండే రెండు పర్వత శిఖరముల మీదContinue reading “Vaalmiki Ramayanam – 68”

Vaalmiki Ramayanam – 67

Vaalmiki Ramayanam – 67 – రామాయణం – 67 – యుద్ధం ప్రారంభమయ్యింది వానరులందరూ ఆ యుద్ధంలో ప్రాసాదాలని తిరగ తోసేసారు పర్వత శిఖరాలని తీసుకొచ్చి విసిరేశారు. చెట్లతో కొట్టారు. కనపడ్డ ప్రతి రాక్షసుడిని చంపేశారు. నాలుగు ద్వారములను మూసి ఉంచారు. బయట ఉన్నవాళ్లు బయట ఉన్నవాళ్ళతో యుద్ధం చేస్తున్నారు. వానరములకు రాక్షసులకు యుద్ధం జరగబోయేముందు రాముడు ” యుద్ధం చేస్తున్న రాక్షసులు కామరుపాన్ని పొందగలరు. వానరములలో కూడా కొంతమంది కామరుపాన్ని పొందగలరు. ఎట్టి పరిస్థితులలోనుContinue reading “Vaalmiki Ramayanam – 67”

Vaalmiki Ramayanam – 66

Vaalmiki Ramayanam – 66 – రామాయణం – 66 – నలుడు వచ్చి సేతు నిర్మాణము ప్రారంభిస్తానన్నాడు. అక్కడున్న వానరులందరూ సంతోషపడిపోయి పర్వతాలు, కొండలు ఎక్కి పెద్ద పెద్ద శిలలు మోసుకొచ్చి సముద్రములో పడేస్తున్నారు. ఆ సమయంలో ఎవరినోట విన్నా ‘ సీతారామ ప్రభువుకి జై ‘ అంటూ ఉత్సాహంగా రకరకాల చెట్లని తీసుకొచ్చి సముద్రంలో పడేశారు. మొదటి రోజున పదునాలుగు యోజనముల సేతువుని నిర్మించారు, రెండు మూడు నాలుగు అయిదు రోజులలో ఇరవై , ఇరవైContinue reading “Vaalmiki Ramayanam – 66”