ధనవంతుని నిధి !!

అనగనగా ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉండేవాడు . అతని దగ్గర లెక్క కట్టలేనంత ధనం ఉండేది . అతనికి ఒక నిధి కూడా ఉంది , ఆ నిధి అతనికి అవసరంలేదు . కానీ దొంగలు పడి మొత్తం దోచేస్తారేమో అనే భయం కూడా ఉండేది . ఆ నిధిని ఏం చెయ్యాలా అని రోజు ఆలోచించేవాడు . ఒక రోజు దాన్నంతటిని అమ్మేయాలిని నిర్ణయించుకున్నాడు . కానీ ఆ నిధిని అమ్మడానికి అతని మనసొప్పలేదుContinue reading “ధనవంతుని నిధి !!”

తెలుగు పద్యాలను నేర్చుకుందాం !! నేర్పిద్దాం !!

కానివాని చేత గసు వీసం బిచ్చి వెంట దిరుగువాడె వెర్రివాడు పిల్లి తిన్న కోడి పిలిచిన పలుకునా విశ్వదాభిరామ వినురవేమ ! భావం : ఓ వేమా ! హీనుడైన మనిషి చేతికి డబ్బును అప్పుగా ఇస్తే అది తిరిగి రాబట్టుకోవటానికి ఆ మనిషి వెంట తిరిగేవాడు పిచ్చివాడని చెప్పచ్చు . ఎందుకంటే పిల్లి కోడిని తిన్నపుడు కోడి ఎలా చనిపోయి శబ్దం లేకుండా ఉంటుందో అలాగే హీనమనిషి చేతిలోనికి పోయిన డబ్బు కూడా తిరిగిరాదు .

వేసవి ఔషదం !!

తీపి లేని కాఫీ , షుగర్ లెస్స్ స్వీట్ అని ఈ మధ్య ప్రతీవాళ్ళు తీపి తగ్గించేశారు .. కానీ పంచదార లేని కాఫీ తగలేం కదా ! మనకు బాగా అలవాటు అయిన పదార్థం కాఫీ .. సరే గాని పంచదార ఎలా తయారు అవుతుందో తెలుసా !! ఈ తియ్యని పదార్థం తయ్యారయ్యేది చెరకుగడలనుంచి . ఇది గడ్డి జాతి కి చెందిన మొక్క . చూడడానికి వెదురు లాగా ఉంటుంది కాని ..Continue reading “వేసవి ఔషదం !!”

నేటి పంచాంగం

ఓం శ్రీ గురుభ్యోనమః శుక్రవారం, జనవరి 8, 2021 శ్రీ శార్వరి నామ సంవత్సరం దక్షిణాయణం హేమంత ఋతువు మార్గశిర మాసం బహుళ పక్షం తిధి:దశమి రా8.19 తదుపరి ఏకాదశి వారం:శుక్రవారం ( భృగువాసరే) నక్షత్రం:స్వాతి మ1.24 తదుపరి విశాఖ యోగం:ధృతి సా5.49 తదుపరి శూలం కరణం:వణిజ ఉ9.30 తదుపరి భద్ర/విష్ఠి రా8.19 ఆ తదుపరి బవ వర్జ్యం :సా6.36 – 8.05 దుర్ముహూర్తం: ఉ8.48 – 9.32 & మ12.28 – 1.12 అమృతకాలం:ఉ6 41వరకుContinue reading “నేటి పంచాంగం”