Daily Horoscope 05/09/2022 

Daily Horoscope 24/03/2022
Daily Horoscope 05/09/2022 
ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు
05, సెప్టెంబర్, 2022
స్వస్తి శ్రీ చాన్ద్రమాన శుభకృత్ నామ సంవత్సరమ్
దక్షిణాయణము
వర్ష ఋతువు
భాద్రపద మాసము
తిథి దశమి తె3.08
వారం: ఇందువాసరే
(సోమవారం)
రాజతే పృధివీ సర్వాసతతం వివిధోత్సవైః l శుభకృద్వత్సరే వృద్ధిః ప్రజానాం పశుభిస్సహ ll
Daily Horoscope 05/09/2022 
Daily Horoscope 05/09/2022

రాశి ఫలాలు 

మేషం

చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. దైవ అనుగ్రహంతో వ్యాపారాలు లాభాల బాట పడతాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.

వృషభం

వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. చిన్ననాటి మిత్రులతో మాట పట్టింపులు కలుగుతాయి. చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు. ఉద్యోగ ప్రయత్నములు అంతగా అనుకూలించవు. దాయాదులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.

మిధునం

జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. ఇంటాబయట ఊహించని చికాకులు పెరుగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు.

కర్కాటకం

ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి. ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుకుంటారు.

సింహం

సమాజంలో పెద్దల నుండి ప్రశంసలు పొందుతారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. మంచి మాట తీరుతో ఇంటాబయట అందరినీ ఆకట్టుకుంటారు. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

కన్య

దూరప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా వేస్తారు. దీర్ఘకాలిక రుణ  ఒత్తిడి అధికమవుతుంది. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు.

తుల

ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులలో  వ్యయ ప్రయాసలు తప్పవు ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి బంధు మిత్రులతో ఊహించిన మాటపట్టింపులు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు వలన నూతన ఋణప్రయత్నాలు చేస్తారు.

వృశ్చికం

ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ప్రణాళికలతో అనుకున్న పనులను పూర్తిచేస్తారు  వ్యాపారాలలో ఉత్సాహంతో ముందుకు సాగుతారు, వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం ఉన్నది. ఒక వ్యవహారంలో దూరప్రాంత బంధుమిత్రుల నుంచి కీలక సమాచారం సేకరిస్తారు.

ధనస్సు

బంధువులతో తొందర పడి మాట్లాడటం మంచిది కాదు.ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కొన్ని వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. దైవదర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాలలో అధికారులతో చర్చలు అంతగా అనుకూలించవు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.

మకరం

కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు  సంతానం పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు అనుకూలమైన కాలం. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు అంచనాలు అందుకుంటారు.

కుంభం

దూర ప్రయాణం సూచనలు ఉన్నవి.సోదరులతో స్థిరస్తి వివాదాలు కలుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయుట మంచిది. వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు మందగిస్తాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు.ఇంటాబయట చికాకులు పెరుగుతాయి.

మీనం

ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. సన్నిహితుల నుంచి అవసరానికి ధనసహాయం అందుతుంది. ఉద్యోగమున అధికారుల అనుగ్రహంతో హోదాలు పెరుగుతాయి. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలకు నూతన పెట్టుబడులు అందుతాయి.

Panchangam

శ్రీ గురుభ్యోనమః
సోమవారం, సెప్టెంబరు 5, 2022
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయణం – వర్ష ఋతువు
భాద్రపద మాసం – శుక్ల పక్షం
తిధి : దశమి తె3.08వరకు
వారం : సోమవారం (ఇందువాసరే)
నక్షత్రం: మూల సా6.27 వరకు
యోగం: ప్రీతి మ10.52 వరకు
కరణం: తైతుల సా4.18 వరకు
తదుపరి గరజి తె3.08 వరకు
వర్జ్యం: సా4.57 – 6.27 &
తె3.22 – 4.51
దుర్ముహూర్తం : 12.23 – 1.12 &
మ2.51 – 3.41
అమృతకాలం : మ12.26 – 1.56
రాహుకాలం : ఉ7.30 – 9.00
యమగండ/కేతుకాలం: ఉ10.30 – 12.00
సూర్యరాశి: సింహం || చంద్రరాశి: ధనుస్సు
సూర్యోదయం: 5.49 || సూర్యాస్తమయం: 6.09

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: