Daily Horoscope 23/08/2022
ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు
23, ఆగష్టు, 2022
స్వస్తి శ్రీ చాన్ద్రమాన శుభకృత్ నామ సంవత్సరమ్
దక్షిణాయణము
వర్ష ఋతువు
శ్రావణ మాసము
కృష్ణ ద్వాదశి
భౌమ్య వాసరే (మంగళ వారం)
రాజతే పృధివీ సర్వాసతతం వివిధోత్సవైః l శుభకృద్వత్సరే వృద్ధిః ప్రజానాం పశుభిస్సహ ll

రాశి ఫలాలు
మేషం
ఈరోజు
విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది. భవిష్యత్ ప్రణాళికలు కొన్ని అమలు చేయగలుగుతారు. సొంతింటి పనుల్లో ముందంజ వేయగలుగుతారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.
దుర్గా ధ్యానం శుభప్రదం
వృషభం
ఈరోజు
మొదలుపెట్టే పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కీలకమైన పనులను కొన్నాళ్లు వాయిదా వేయడమే మంచిది. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి.
దుర్గరాధన శుభప్రదం
మిధునం
ఈరోజు
మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. మీరు ఎప్పటినుంచో చేయాలనుకుంటున్న ఒక ముఖ్యమైన పని దాదాపుగా పూర్తి కావస్తుంది.
మహాలక్ష్మీ అష్టోత్తరం చదివితే మంచిది
కర్కాటకం
ఈరోజు
తలపెట్టిన పనుల్లో విఘ్నాలు పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. ముఖ్య విషయాల్లో అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. అధికారుల సహకారం ఉంటుంది. శివ స్తోత్రం పఠించడం మంచిది
సింహం
ఈరోజు
చేపట్టే పనుల్లో శ్రమపెరగకుండా చూసుకోవాలి. ఆర్థిక విషయాల్లో పొదుపు సూత్రాన్ని పాటించాలి. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు.
ఆపదలు తొలగడానికై వేంకటేశ్వరుణ్ణి పూజించాలి
కన్య
ఈరోజు
ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమయస్పూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు.
ఇష్టదైవారాధన మంచిది
తుల
ఈరోజు
శ్రమతో కూడిన ఫలితాలుంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఎలాంటి పరిస్థితులలోనూ మనోధైర్యాన్ని కోల్పోవద్దు.
దైవారాధన చేస్తే ఆర్థిక ఇబ్బందులు నుంచి బయటపడవచ్చు
వృశ్చికం
ఈరోజు
మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్న పనులను పూర్తిచేస్తారు. ఇష్టులతో కాలాన్ని గడుపుతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ప్రయాణాల్లో అజాగ్రత్త వద్దు.
వేంకటేశ్వర స్వామి సందర్శనం ఉత్తమం
ధనుస్సు
ఈరోజు
చేపట్టే పనిలో అనుకూల ఫలితాలున్నాయి. బంధువుల సహకారం ఉంటుంది. కీలక వ్యవహారాల్లో ముందుచూపు అవసరం.
హనుమాన్ చాలీసా పఠించడం వలన మంచి ఫలితాలు పొందగలుగుతారు
మకరం
ఈరోజు
మీమీ రంగాల్లో ఓర్పు పట్టుదల చాలా అవసరం. బంధువులతో వాదనలకు దిగడం వలన విబేధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అవసరానికి మించిన ఖర్చులుంటాయి.
నవగ్రహ ఆలయ సందర్శనం శుభప్రదం
కుంభం
ఈరోజు
పనులకు ఆటంకం ఎదురవకుండా చూసుకోవాలి. కొన్ని సమయాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. ధర్మకార్యాచరణతో మేలు చేకూరుతుంది.
గోవింద నామాలు చదివితే బాగుంటుంది
మీనం
ఈరోజు
స్థిరమైన ఆలోచనలతో మంచి చేకూరుతుంది. ఒక వ్యవహారంలో సహాయం అందుతుంది. ఒక శుభవార్త మీ మనోవిశ్వాసాన్ని పెంచుతుంది. దైవబలం ఉంది. ఇష్టదైవారాధన శుభప్రదం.
Panchangam
ఓం శ్రీ గురుభ్యోనమః
ఆగష్టు 23, 2022
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయణం
వర్ష ఋతువు
శ్రావణ మాసం
కృష్ణ పక్షం
తిథి: ఏకాదశి ఉ5.33
& ద్వాదశి
వారం: భౌమ్యవాసరే
(మంగళవారం)
నక్షత్రం: ఆర్ద్ర ఉ11.38
యోగం: సిద్ధి రా2.25
కరణం: బాలువ ఉ5.52
&
కౌలువ సా6.52
వర్జ్యం: రా12.57-2.42
దుర్ముహూర్తం: ఉ8.17-9.07
&
రా10.54-11.40
అమృతకాలం: లేదు
రాహుకాలం: మ3.00-4.30
యమగండం: ఉ9.00-10.30
సూర్యరాశి: సింహం
చంద్రరాశి: మిథునం
సూర్యోదయం: 5.47
సూర్యాస్తమయం: 6.19