Daily Horoscope 17/08/2022 

Daily Horoscope 24/03/2022
Daily Horoscope 17/08/2022
ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు
17, ఆగష్టు, 2022
స్వస్తి శ్రీ చాన్ద్రమాన శుభకృత్ నామ సంవత్సరమ్
దక్షిణాయణము
వర్ష ఋతువు
శ్రావణ మాసము
కృష్ణ షష్ఠి
సౌమ్య వాసరే (బుధ వారం)
రాజతే పృధివీ సర్వాసతతం వివిధోత్సవైః l శుభకృద్వత్సరే వృద్ధిః ప్రజానాం పశుభిస్సహ ll
Daily Horoscope 17/08/2022 
Daily Horoscope 17/08/2022

రాశి ఫలాలు 

మేషం

ఈరోజు
శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. గొప్ప భవిష్యత్తు కోసం మంచి ఆలోచనలు చేస్తారు. కుటుంబ సభ్యులకు శుభకాలం. కీలక సమయాల్లో ధైర్యంగా వ్యవహరిస్తారు. అనవసర విషయాల పట్ల ఎక్కువ సమయాన్ని వెచ్చించకండి.
శివారాధన శుభప్రదం

 వృషభం 

ఈరోజు
మీ మీ రంగాల్లో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. సంపూర్ణ అవగాహన వచ్చిన తరువాతే పనులను ప్రారంభించాలి. బాగా కష్టపడాల్సిన సమయం ఇది . లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టు వదలకండి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. విందు,వినోదాల్లో పాల్గొంటారు.
ఇష్టదైవారాధన శుభప్రదం

 మిధునం

ఈరోజు
ఆశయాలు నెరవేరుతాయి. సమయానికి బుద్ధిబలం పనిచేస్తుంది. కుటుంబసభ్యుల మాటకు విలువ ఇవ్వండి .భవిష్యత్తును దృష్టిలో  ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది. సమాజంలో కీర్తి పెరుగుతుంది. అవసరానికి తగినట్టు ముందుకు సాగడం మేలు.
శివారాధన శుభాన్ని చేకూరుస్తుంది

 కర్కాటకం 

ఈరోజు
ఏ పని తలపెట్టినా ఇట్టే పూర్తవుతుంది. ధర్మసిద్ధి ఉంది. కీలక వ్యవహారాల విషయంలో కుటుంబ సభ్యులతో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తిచేయగలుగుతారు. కొన్ని చర్చలు మీకు లాభిస్తాయి.
శ్రీప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి

 సింహం

ఈరోజు
ప్రగతి సాధిస్తారు. ముఖ్యమైన లావాదేవీల్లో సొంత నిర్ణయాలు వికటిస్తాయి. కొందరి ప్రవర్తన కారణంగా ఆటంకాలు ఎదురవుతాయి. చెడు తలంపులు వద్దు. కీలక విషయాల్లో నిపుణులను సంప్రదించడం మంచిది. ప్రశాంతంగా ఆలోచించడం మంచిది.
విష్ణు సందర్శనం శుభప్రదం

 కన్య

ఈరోజు
మిశ్రమ కాలం. మనోబలాన్ని కోల్పోవద్దు. మంచిపనులు తలపెడతారు. అనవసర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ వాతావరణం అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. శారీరక శ్రమ పెరుగుతుంది.
శని ధ్యానం శుభప్రదం

 తుల

ఈరోజు
చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. అలసట పెరగకుండా చూసుకోవాలి. శత్రువుల విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాలి.
లక్ష్మీస్తుతి శుభాన్ని ఇస్తుంది

 వృశ్చికం

ఈరోజు
చేపట్టిన కార్యక్రమాలను మనోబలంతో పూర్తిచేస్తారు . ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో ప్రోత్సాహకర  పరిస్థితులు ఏర్పడతాయి. ప్రయాణాలు ఫలిస్తాయి.
గోసేవ చేయడం మంచిది

 ధనుస్సు

ఈరోజు
చేపట్టే పనులలో శ్రమ పెరుగుతుంది. అధికారులు మీ తీరుతో సంతృప్తిపడక పోవచ్చు. బంధు,మిత్రులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. ఒక సంఘటన మనస్తాపాన్ని కలిగిస్తుంది.
ఎలాంటి పరిస్థితులలోనూ దైవారాధన మానవద్దు

మకరం

ఈరోజు
గతంలో పూర్తికాని పనుల్లో కదలిక వస్తుంది. ముఖ్య వ్యవహారాలలో.. విషయంలోను కాస్త జాగ్రత్తగా ఉండాలి. నచ్చినవారితో ఆనందాన్ని పంచుకుంటారు. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణాల్లో జాగ్రత్త.
దుర్గా స్తోత్రం  చదవాలి

 కుంభం

ఈరోజు
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో మంచి ఫలితాలు ఉన్నాయి. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది సరైన సమయం. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. బంధు,మిత్రుల ఆదరణ ఉంటుంది. దైవారాధన మానవద్దు

 మీనం

ఈరోజు
శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులకు స్వల్ప అనారోగ్య సమస్యలు వస్తాయి. కొన్ని కీలకమైన వ్యవహారాలలో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి.
శివ అష్టోత్తర శతనామావళి పారాయణ మంచిది

Panchangam

ఓం శ్రీ గురుభ్యోనమః
ఆగష్టు 17, 2022
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయణం
వర్ష ఋతువు
శ్రావణ మాసం
కృష్ణ పక్షం
తిథి: షష్ఠి రా12.01
వారం: సౌమ్యవాసరే
(బుధవారం)
నక్షత్రం: అశ్విని రా2.23
యోగం: గండం రా2.05
కరణం: గరజి మ12.09
&
వణిఙ రా12.02
వర్జ్యం: రా10.17-11.55
దుర్ముహూర్తం: ఉ11.38-12.29
అమృతకాలం: రా7.01-8.39
రాహుకాలం: మ12.00-1.30
యమగండం: ఉ7.30-9.00
సూర్యరాశి: కర్కాటకం
చంద్రరాశి: మేషం
సూర్యోదయం: 5.46
సూర్యాస్తమయం: 6.23

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: