Daily Horoscope 09/01/2022
ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు
09, జనవరి , 2022
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
దక్షణాయనము
హేమంత ఋతువు
పుష్య మాసము
శుక్ల పంచమి
సప్తమి మ3.43
వారం: ఆదివారం
శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

రాశి ఫలాలు
మేషం
అశ్వని1,2,3,4,భరణి 1,2,3,4, కృతిక 1,
విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి.
స్థిరాస్తి అమ్మకానికై చేయుయత్నం విరమించుకోవటం మంచిది. ఆలయ సందర్శనాలలో చురుకుగా పాల్గొంటారు. వాణిజ్య ఒప్పందాలు, నూతన వ్యాపారాలకు సంబంధించిన వ్యవహారాల్లో పునరాలోచన అవసరం. స్త్రీలు ఆత్మీయులకు విలువైన కానుకలు అందిస్తారు. మీ యత్నాల్లో పొరపాట్లు దొరే ఆస్కారం ఉంది.చేపట్టిన వ్యవహారములో విజయం సాధిస్తారు.మొండి బాకీలు వసూలవుతాయి
వృషభం
కృతిక 2,3,4,రోహిణి 1,2,3,4, మృగశిర1,2,
ఇంట బయట ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారుస్త్రీలకు చుట్టుపక్కల వారితో సఖ్యత లోపిస్తుంది. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.మీ ప్రేమ మీ జీవితంలో మరింత ఆనందాన్ని నింపుతుంది. కాంట్రాక్టుల విషయంలో పునరాలోచన చాలా అవసరం. రాజకీయ నాయకులకు దూర ప్రయాణాలలో మెళుకువ అవసరం.
మిథునం
మృగశిర 3,4, ఆరుద్ర 1,2,3,4, పున్వరసు1,2,3,
వ్యాపారమునకు సకాలంలో పెట్టుబడులు అందక ఇబ్బందులు ఎదుర్కొంటారురావలసిన ధనం అతికష్టం మీద వసూలవుతుంది.కుటుంబ బాధ్యతలు మరింత పెరుగుతాయి.చిరు వ్యాపారులకు లాభదాయకం. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం ఉండదు.ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తుల శ్రమను అధికారులు గుర్తిస్తారు. ప్రైవేటు, పత్రికా సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం తప్పవు.
కర్కాటకం
పున్వరసు 4,పుష్యమి 1,2,3,4, అశ్లేష 1,2,3,4,
వ్యాపారాలు విస్తరణకు తీసుకున్న నిర్ణయాలు కలసి వస్తాయిస్త్రీలకు ఆర్జనపట్ల ఆసక్తి, అందుకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. పెరిగిన ధరలు, ఆకస్మిక ఖర్చుల వల్ల ఆటుపోట్లు తప్పవు. చేపట్టిన పనుల్లో ఆటంకాలెదురైనా మొండిగా పూర్తి చేస్తారు. గృహంలో ఏదైనావస్తువు కనిపించకుండా పోయే ఆస్కారం ఉంది. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాల్లో ఒత్తిడి, చికాకులు తప్పవు.చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం ఉండదు
సింహం
మఘ 1,2,3,4, పుబ్భ 1,2,3,4, ఉత్తర1,
కుటుంబసభ్యులతో స్వల్ప విభేదాలు ఉంటాయి. ఆరోగ్యం మందగిస్తుంది. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరగుతుంది. నిరుద్యోగ యత్నాలు కలిసివస్తాయి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. ప్రయాణాలు వాయిదా పడతాయి.ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. మిమ్ములను తక్కువ అంచనా వేసిన వారే మీ ఔన్నత్యాన్ని గుర్తిస్తారు.పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత చాలా అవసరం.
కన్య
ఉత్తర2,3,4, హస్త 1,2,3,4,చిత్త 1,2,
చేపట్టిన వ్యవహారాలలో విజయం సాదిస్తారు
వ్యాపారాభివృద్ధికి చేపట్టిన ప్రణాళికలు, పథకాలు సత్ఫలితాలనివ్వగలవు. సమయానికి సహకరించని మిత్రుల వల్ల ఒకింత ఇబ్బందులెదుర్కుంటారు. మొండిబకాయిలు వసూలు కాగలవు. స్త్రీలకు బంధువర్గాల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలమైన మార్పులుంటాయి.స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు లాభిస్తాయి.
తుల
చిత్త 3,4, స్వాతి 1,2,3,4, విశాఖ1,2,3,
వ్యవసాయ రంగాల వారికి నూతన ఆలోచలు స్ఫురిస్తాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది.చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది.ఇంటాబయట చికాకులు తప్పవు.ఏ విషయంలోను ఎదుటివారిని అతిగా విశ్వసించటం మంచిది కాదు. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి.రావలసిన ధనం అందకపోవటంతో ఇబ్బందులు తప్పవు.
కుటుంబసభ్యులతో వివాదాలు వలన మానసిక సమస్యలు కలుగుతాయి
వృశ్చికం
విశాఖ 4, అనురాధ 1,2,3,4,జ్యేష్ఠ 1,2,3,4,
స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఏజెంట్లకు, బ్రోకర్లకు, రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఒడిదుడుకులు వంటివి ఎదుర్కొంటారు.రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది. ద్విచక్రవాహనం పై దూరప్రయాణాలు మంచిదికాదు అని గమనించండి. మీ మాటకు సర్వత్రా ఆమోదం లభిస్తుంది.వ్యాపార వ్యవహారాలలో అనుకూలత పెరుగుతుంది. ప్రముఖులు, అయిన వారిని కలుసుకుంటారు.
ధనుస్సు
మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
దాయదులతో ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది.బ్యాంకింగ్ వ్యవహారాలు, సంప్రదింపులకు సంబంధించిన విషయాల్లో ఏకాగ్రత అవసరం. కోర్టు వ్యవహరాలు ప్రగతిపథంలో నడుస్తాయి. చిట్స్, ఫైనాన్సు రంగాల వారికి ఆటు పోట్లు తప్పవు. వ్యాపారాలలో నష్ట సూచనలు ఉన్నవి.ఫ్యాన్సీ, మందులు, ఎరువుల వ్యాపారులకు పురోభివృద్ధి.దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది.
మకరం
ఉత్తరషాఢ 2,3,4,శ్రవణం 1,2,3,4,ధనిష్ట 1,2,
కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడులు పెరుగుతాయి.
ఉద్యోగస్తులు తోటివారి కారణంగా అధికారులతో మాటపడవలసి వస్తుంది. రావలసిన ధనం చేతికందటంతో పొదుపు దిశగా మీ ఆలోచనలు
ఉంటాయి. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు మంచివి కాదు.స్త్రీల మనోవాంఛలు నెరవుగలవు. ఉమ్మడి వ్యాపారాల నుండి విడిపోవాలనే ఆలోచన బలపడుతుంది. కళ, క్రీడా రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి.
దూరప్రయాణాలు వాయిదా పడతాయి.
కుంభం
ధనిష్ట 3,4, శతభిషం 1,2,3,4, పూ||భా||1,2,3,
భాగస్వామిక ఒప్పందాలు, స్థిరాస్తి క్రయవిక్రయాల్లో ప్రముఖుల సలహా పాటించటం మంచిది. వైద్య, ఇంజనీరింగ్, శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి ఆశాజనకంగా ఉంటుంది. ఆదాయ వ్యయాలకు బడ్జెట్ రూపొందించుకుంటారు.భూ వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. కాంట్రాక్టర్లకు రావలసిన ధనం అందటంతో పనులు వేగవంతమవుతాయి.ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు మంచివి కాదు
మీనం
పూ||భాధ్ర||4,ఉ||భా||1,2,3,4,రేవతి1,2,3,4,
అయినవారితో చిన్నపాటి వివాదాలు తప్పవు తలపెట్టిన పనులు మందకొడిగా పూర్తి చేస్తారు. కొంతమంది మీ ఉన్నతిని చూసి అపోహపడే ఆస్కారం ఉంది. వ్యయప్రయాసలు అధికమo
అవుతాయి.పెద్దల ఆరోగ్య, ఆహార వ్యవహారాలలో మెళుకువ వహించండి. ఉద్యోగస్తులు స్థానమార్పిడి కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. బంధువులు మీ నుంచి పెద్దమొత్తంలో ధనసహాయం అర్థిస్తారు.
ధన వ్యవహారాలలో జాగ్రత్త అవసరం
Panchangam
ఓం శ్రీ గురుభ్యోనమః
జనవరి 9, 2022
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం
హేమంతఋతువు
పుష్య మాసం
శుక్ల పక్షం
తిధి: సప్తమి మ3.43
వారం: ఆదివారం
(భానువాసరే)
నక్షత్రం: ఉత్తరాభాద్ర ఉ11.56
యోగం: పరిఘము మ3.37
కరణం: వణిజ మ3.43
తదుపరి విష్ఠి తె3.56
వర్జ్యం: రా12.23 – 2.03
దుర్ముహూర్తం: సా4.09 – 4.53
అమృతకాలం: ఉ7.02 – 8.40
రాహుకాలం: సా4.30 – 6.00
యమగండం: మ12.00 – 1.30
సూర్యరాశి: ధనుస్సు
చంద్రరాశి: మీనం
సూర్యోదయం: 6.37
సూర్యాస్తమయం: 5.37