Daily Horoscope 05/01/2022
ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు
05, జనవరి , 2022
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
దక్షణాయనము
హేమంత ఋతువు
పుష్య మాసము
శుక్ల తదియ
సౌమ్య వాసరే (బుధవారం)
శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹
రాశి ఫలాలు
మేషం
ఈరోజు
ఆత్మవిశ్వాసంతో పనిచేసి మంచి ఫలితాలు సాధిస్తారు. ఆత్మీయుల సలహాలు ప్రశాంతతను ఇస్తాయి. కుటుంబసభ్యులతో సఖ్యతగా మెలగాలి. ఎవరితోనూ వాదోపవాదాలు చేయకండి .
గణపతి ఆరాధన శ్రేయోదాయకం
వృషభం
ఈరోజు
కీలక విషయాల్లో సొంత నిర్ణయాలు పనిచేయవు. తోటివారి సలహాలు తప్పనిసరి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. సమయాన్ని వృథా చేయకండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
నవగ్రహ ఆరాధన శుభప్రదం
మిధునం
ఈరోజు
మిశ్రమ కాలం. కష్టాన్నినమ్ముకొని ముందుకు సాగండి. తిరుగులేని ఫలితాలను అందుకుంటారు. ఒకటీరెండు ఆటంకాలు ఎదురైనా పెద్దగా ఇబ్బంది కలిగించవు. ప్రయాణాల్లో జాగ్రత్త.
చంద్ర ధ్యానం శుభకరం
కర్కాటకం
ఈరోజు
తోటివారి సహకారం ఉంటుంది. మీ ప్రతిభకు పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి. శరీరసౌఖ్యం ఉంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆంజనేయ స్తోత్రం చదివితే బాగుంటుంది
సింహం
ఈరోజు
అనుకూల ఫలితాలు ఉన్నాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. కొన్ని పరిస్థితులు బాధతో పాటు మానసిక ఇబ్బంది కలిగిస్తాయి.
లింగాష్టకం చదవడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు
కన్య
ఈరోజు
తోటివారి సహకారంతో పనులు పూర్తవుతాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. పెద్దలను సంప్రదించకుండా ఏ నిర్ణయం తీసుకోవద్దు. తొందరపాటుగా వ్యవహరిస్తే సమస్యలు తప్పవు. దుర్గాదేవిని ఆరాధించడం వల్ల బాగుంటుంది
తుల
ఈరోజు
మీ కృషే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. అనారోగ్య సమస్యలు పెరగకుండా చూసుకోవాలి. అనవసర ఖర్చులు పెరగకుండా జాగ్రత్తపడాలి. శివారాధన వల్ల శుభఫలితాలను అందుకుంటారు
వృశ్చికం
ఈరోజు
అనుకున్న పని నెరవేరుతుంది. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు. మీ తెలివితేటలతో అందరినీ ఆకర్షిస్తారు. విద్యావంతులతో పరిచయాలు ఏర్పడతాయి.
సుబ్రహ్మణ్య ధ్యాన శ్లోకం చదివితే మంచి జరుగుతుంది
ధనుస్సు
ఈరోజు
పట్టుదలతో పనిచేయండి. భవిష్యత్తు అనుకూలంగా ఉంది. మీకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా పూర్తిచేస్తారు. సమయానుకూలంగా ముందుకు సాగండి. పెద్దల ఆశీర్వచనాలు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాయి.
గణపతి ధ్యానం శుభప్రదం
మకరం
ఈరోజు
పెద్దల సహాయంతో ఒక పని పూర్తి చేస్తారు. వ్యాపారంలో క్రమంగా ఎదుగుతారు. కొందరు మీ ఉత్సాహానికి భంగం కలిగించాలని చూస్తారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
శివారాధన శుభప్రదం
కుంభం
ఈరోజు
ధైర్యంతో ముందడుగు వేసి అనుకున్న పనిని పూర్తి చేయగలుగుతారు. చేయని తప్పునకు నింద పడాల్సి వస్తుంది. కలహ సూచన. అనవసర ఖర్చులు పెరుగుతాయి. మానసిక ప్రశాంతత లోపిస్తుంది.
లక్ష్మీ ఆరాధన మంచిది
మీనం
ఈరోజు
ఆర్థికంగా విజయాలు సాధిస్తారు. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. రాజదర్శన సల్లాపాలు, భోజన సౌఖ్యం లభిస్తాయి.
శివాష్టకం చదివితే మంచి జరుగుతుంది
Panchangam
శ్రీ గురుభ్యోనమః
బుధవారం, జనవరి 5, 2022
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం – హేమంతఋతువు
పుష్య మాసం – శుక్ల పక్షం
తిథి:తదియ సా6.44 వరకు
వారం:బుధవారం(సౌమ్యవాసరే)
నక్షత్రం:శ్రవణం మ12.51 వరకు
యోగం:వజ్రం రా10.51
కరణం:తైతుల ఉ7.36 తదుపరి గరజి సా6.44 ఆ తదుపరి వణిజ తె6.02
వర్జ్యం:సా4.42 – 6.14
దుర్ముహూర్తం:ఉ11.43 – 12.27
అమృతకాలం:రా1.57 – 3.29
రాహుకాలం:మ12.00 – 1.30
యమగండ/కేతుకాలం:ఉ7.30 – 9.00
సూర్యరాశి:ధనుస్సు
చంద్రరాశి: మకరం
సూర్యోదయం:6.36
సూర్యాస్తమయం:5.35