Daily Horoscope 20/12/2021
ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు
20, డిసెంబర్ , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
దక్షణాయనము
హేమంత ఋతువు
మార్గశిర మాసము
కృష్ణ పాడ్యమి
ఇందు వాసరే (సోమవారం)
శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

రాశి ఫలాలు
మేషం
ఈరోజు ఒక వ్యవహారంలో కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. ఎవ్వరితోను వాదోపవాదాలు చేయకండి. అధికారులను ప్రసన్నం చేసుకోవడానికి శ్రమించాల్సి వస్తుంది. గణేశ్ అష్టోత్తర శతనామావళి పఠిస్తే సమస్యలు తొలగుతాయి
వృషభం
ఈరోజు
మధ్యమ ఫలితాలున్నాయి. తోటి వారిని కలుపుకుపోవడంవల్ల ఇబ్బందులు తగ్గుతాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆపదలు ఎదురవుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఇష్టదేవతా స్తుతి శుభప్రదం
మిధునం
ఈరోజు
శుభకాలం. మంచి పనులు చేపడతారు. గొప్ప వారితో సత్సాంగత్యం ఏర్పడుతుంది. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది. శ్రమకు గుర్తింపు దక్కుతుంది.
సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన శుభప్రదం
కర్కాటకం
ఈరోజు
పట్టుదలతో పనిచేస్తే కార్యాలు విజయవంతంగా పూర్తవుతాయి. స్థిరాస్తి కొనుగోలు వంటి విషయాలు లాభిస్తాయి. మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. సూర్యాష్ఠకం పఠిస్తే శుభఫలితాలు కలుగుతాయి
సింహం
ఈరోజు
అనుకూలమైన కాలం. ఉద్యోగంలో పెద్దల ఆశిస్సులు లభిస్తాయి. కీర్తి కోసం శ్రమిస్తారు. గృహానికి సంబంధించిన పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.
ఇష్టదేవత ఆరాధన మేలు చేస్తుంది
కన్య
ఈరోజు
ఆశించిన ఫలితాలు దక్కుతాయి. ముఖ్య విషయాల్లో ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. మనోబలం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి.
ఈశ్వర సందర్శనం శుభప్రదం
తుల
ఈరోజు
మనఃసౌఖ్యం ఉంది. కీలకమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు జరిగే అవకాశాలు ఉన్నాయి. వైరాగ్యాన్ని దరిచేరనీయకండి. సాయిబాబా నామాన్ని జపించడం ఉత్తమం
వృశ్చికం
ఈరోజు
తోటివారి సహకారంతో పనులు పూర్తవుతాయి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. అభివృద్ధికి సంబందించిన శుభవర్తలు వింటారు. మొదలుపెట్టిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. శని శ్లోకం చదవాలి
ధనుస్సు
ఈరోజు
సకాలంలో పనులు పూర్తి అవుతాయి. మీ కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు.
రామనామ జపం శ్రేయోదాయకం
మకరం
ఈరోజు
అదృష్టం వరిస్తుంది. లక్ష్యాన్ని చేరుకునే దిశగా ముందుకు సాగుతారు. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.
ఇష్టదేవతారాధన సత్ఫలితాలను ఇస్తుంది
కుంభం
ఈరోజు
మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఆర్థికంగా మిశ్రమ కాలం. విందు వినోదాలతో ఆనందంగా గడుపుతారు.
లక్ష్మీధ్యానం మేలుచేస్తుంది
మీనం
ఈరోజు
సంతోషకరమైన వార్తలను వింటారు. శరీర సౌఖ్యం ఉంది. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. భోజనసౌఖ్యం ఉంది.
ఆంజనేయ ఆరాధన శుభప్రదం
Panchangam
పంచాంగం
తేది : 20, డిసెంబర్ 2021
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : మార్గశిరమాసం
ఋతువు : హేమంత ఋతువు
కాలము : శీతాకాలం
వారము : సోమవారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : పాడ్యమి
(నిన్న ఉదయం 8 గం॥ 41 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 10 గం॥ 46 ని॥ వరకు)
నక్షత్రం : ఆరుద్ర
(నిన్న సాయంత్రం 4 గం॥ 10 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 6 గం॥ 38 ని॥ వరకు)
వర్జ్యం : (ఈరోజు లేదు
దుర్ముహూర్తం : (ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 18 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 6 ని॥ వరకు)(ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 29 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 17 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 8 గం॥ 3 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 26 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 30 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 3 గం॥ 00 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 10 గం॥ 30 ని॥ నుంచి ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 00 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 28 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 5 గం॥ 25 ని॥ లకు