ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు
1, డిసెంబర్ 2021
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : కార్తీకమాసం
ఋతువు : శరత్ ఋతువు

రాశిఫలాలు
మేషం
అశ్వని1,2,3,4,భరణి 1,2,3,4, కృతిక 1, వ్యవహారాలు నత్తనడకన సాగుతాయిఅని నేను మీ గురుజిగా చెప్పుచున్నా.చుట్టుపక్కల వారితో స్ధిరాస్తి వివాదాల కలుగుతాయి. కళాకారులకు చికాకులు పెరుగుతాయి.ఆరోగ్యపరిస్థితి నిరాశ పరుస్తుంది. దీర్ఘకాలిక రుణ బాధలు తప్పవు. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు.కొన్ని వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో స్థిర నిర్ణయాలు చేసి లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు స్థాన చలన సూచనలు. నిరుద్యోగులు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి.కీలకమైనవిషయాలు తెలుసుకుంటారు. ఇంటి ఇరుగు-పొరుగువారితో బహుజాగ్రర్తగా ఉండాలి. Daily Horoscope 01/12/2021
వృషభం
కృతిక 2,3,4,రోహిణి 1,2,3,4, మృగశిర1,2, .వివాహయత్నాలు సానుకూలమవుతాయి. ధనపరంగా ఇబ్బందులు తప్పవు. ఇంటా బయట దీర్ఘకాలిక సమస్యలు చికాకు పరుస్తాయి.ఒక కీలక సమాచారం ఆకట్టుకుంటుంది. పరిచయాలు విస్తృతమవుతాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి. వృత్తి వ్యాపారాలలలో స్వంత ఆలోచనలు కలసి రావు. భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. దొంగతనంలాంటిది వాదు పడును.
మిథునం
మృగశిర 3,4, ఆరుద్ర 1,2,3,4, పున్వరసు1,2,3, బంధువులతో వివాదాల వలన దూర ప్రయాణాలు ఉంటాయి. ధనాదాయ మార్గలు పెరుగుతాయి.ఇతరుల సహాయ సహకారాలతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.కళారంగాల వారికి ఒత్తిడులు. దీర్ఘాకాలిక రుణాలు తీర్చగలుగుతారు. సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. శారీరక మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఉద్యోగులు మరింత కష్టపడాల్సిన సమయం. వృత్తి ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది.మరియోకసారి అయినవారితో ఏసంబంధాలు లేకుండా కోర్టుకు ఎక్కేను.
కర్కాటకం
పున్వరసు 4,పుష్యమి 1,2,3,4, అశ్లేష 1,2,3,4, వ్యాపారులు నిదానంగా సాగడం మంచిది ఉప్పెనకు పొకండి. శారీరక రుగ్మతలు. మానసిక ఆందోళన.ఆర్థిక పరిస్థితి పురోగమిస్తుంది. ఇంటాబయటా సమస్యలు ఉన్నప్పటికీ నిదానంగా పరిష్కరించుకుంటారు. అకారణంగా తగాదాలు కొన్ని విషయాలలో వెనుకడుగు తప్పదు. వృత్తి వ్యాపారాలలో నష్టాలు అధిగమించి లాభాల పొందుతారు. ఉద్యోగమున అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రయాణాలు ఉంటాయి.
అవకాశాలు చేజారవచ్చు.
సింహం
మఘ 1,2,3,4, పుబ్భ 1,2,3,4, ఉత్తర1, ఉద్యోగ వర్గాలకు చికాకులు తప్పవు. శారీరక మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.పరిస్థితులు అనుకూలించవు. మాతృ వర్గ బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి.కుటుంబంలో చికాకులు. ఋణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. పనులలో స్వల్ప ఆటంకాలు. చేపట్టిన ప్రతి పనిలో అడ్డంకులు తప్పవు. వృత్తి వ్యాపారాలలొ మిశ్రమ ఫలితాలుంటాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్తి వివాదాలు.
కన్య
ఉత్తర2,3,4, హస్త 1,2,3,4,చిత్త 1,2, రాజకీయవర్గాలకు ఉత్సాహవంతమైన కాలం. కీలక వ్యవహారాలలో ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు.దూరపు బంధువుల నుంచి ధనలబ్ధి. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం కాగలరు నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో తొందర పడి మాట్లాడటం మంచిది కాదు. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు తప్పవు. ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు.శత్రు విజయం. వ్యాపారులకు లాభాలు అందుకుంటారు. కాంట్రాక్టులు లభిస్తాయి.
తుల
చిత్త 3,4, స్వాతి 1,2,3,4, విశాఖ1,2,3, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇతరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు ఊరిస్తాయి. సంతాన ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమౌతాయి. కుటుంబ సభ్యుల చేయూతతో పనులు పూర్తి.వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలలో అనూహ్యమైన భాగస్వామల మధ్య మార్పులు. వ్యాపారమున విలువైన వస్తువుల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. దైవ చింతన పెరుగుతుంది.
వృశ్చికం
విశాఖ 4, అనురాధ 1,2,3,4,జ్యేష్ఠ 1,2,3,4, కళారంగం వారికి విదేశీ పర్యటనలు వాయిదా. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు.గృహనిర్మాణ పనులకు శ్రీకారం చుడతారు. ఆలోచనలు నిలకడ ఉండవు. అయినవారి నుంచి ఒత్తిడులు.వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. సంతాన ఆరోగ్యం విషయంలో శుభ వార్తలు అందుతాయి. ప్రయాణాల్లో ఆటంకాలు. కాస్త నిదానం పాటించాలి.లోగడ మొక్కుబడులు తీర్చండి అప్పటికిదాకా సమస్యలు ఇలానే ఉంటాయి.
ధనుస్సు
మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం రాజకీయవర్గాలకు మానసిక ఆందోళన.దూరపు బంధువుల నుండి వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది. వ్యయప్రయాసలు ఒత్తిడులు. చేపట్టిన పనులలో జాప్యం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. నిర్ణయాలలో ఆచి తూచి అడుగువేయండి. ఆర్థిక పరిస్థితి కొంత వరకు అనుకూలిస్తుంది. వృత్తి ఉద్యోగ విషయాల్లో అధికారులతో చర్చలు సఫలమౌతాయి పనుల్లో అవాంతరాలు. శారీరక రుగ్మతలు. కళాకారులకు ఒత్తిడులు.కుటుంబసమస్యలు.
మకరం
ఉత్తరషాఢ 2,3,4,శ్రవణం 1,2,3,4,ధనిష్ట 1,2, ఉద్యోగాలలో అనూహ్యమైన విజయాలు సాధిస్తారు. అనుకున్న సమయానికి అనుకున్న రీతిలో సౌకర్యాలు లభించక ఇబ్బందిపడతారు.దూరప్రయాణాలు వాయిదా పడుతాయి.రాబడి ఆశించినంతగా ఉంటుంది. కొన్ని వ్యవహారాలు సమయానికి చక్కదిద్దుతారు.ధన విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు.వృత్తి ఉద్యోగాలలో నిలకడ లోపిస్తుంది. కొందరి ప్రవర్తన మానసికంగా మరింత చికాకు పరుస్తుంది. వ్యాపారంగం వారికి విశేషంగా కలిసి వస్తుంది.
కుంభం
ధనిష్ట 3,4, శతభిషం 1,2,3,4, పూ||భా||1,2,3, ఉద్యోగులకు చిక్కులు తొలగే సమయం. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు నూతన వాహనం కొనుగోలు చేస్తారు. రియల్ ఎస్టేట్ల వారికి శ్రమ ఫలిస్తుంది.మహిళలకు గందరగోళం తొలగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి.గృహం, వాహన యోగాలు ఉంటాయి.గృహమునకు బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. పలుకుబడి పెంచుకోండి. మత్తుపానియములకు కొన్నిరోజులు దూరం ఉండవలిసివస్తది.ఇంటా బయటా
మీ మాటకు విలువ పెరుగుతుంది
మీనం
పూ||భాధ్ర||4,ఉ||భా||1,2,3,4,రేవతి1,2,3,4, మాటకు కట్టుబడి ముందుకు సాగండి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు అన్ని వైపుల నుండి అనుకూలత పెరుగుతుంది.అదనపు రాబడి ఉంటుంది. కుటుంబ వ్యవహారాలలో మీ నిర్ణయాలు అందరికి నచ్చేవిధంగా ఉంటాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి.స్థిరాస్తి వివాదాలు తీరతాయి. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ధన లాభాలు పొందుతారు. కొత్త అంచనాలతో సాగుతారు.సోదరులతో స్థిరస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. Daily Horoscope 01/12/2021
Panchangam
పంచాంగం
తేది : 1, డిసెంబర్ 2021
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : కార్తీకమాసం
ఋతువు : శరత్ ఋతువు
కాలము : వర్షాకాలం
వారము : బుధవారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : ద్వాదశి
(నిన్న రాత్రి 9 గం॥ 47 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 8 గం॥ 12 ని॥ వరకు)
నక్షత్రం : చిత్త
(నిన్న సాయంత్రం 5 గం॥ 00 ని॥ నుంచి
ఈరోజు సాయంత్రం 4 గం॥ 8 ని॥ వరకు)
వర్జ్యం : (ఈరోజు రాత్రి 9 గం॥ 26 ని॥ నుంచి ఈరోజు రాత్రి 10 గం॥ 47 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 11 గం॥ 27 గం ॥ నుంచి ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 15 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 00 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 30 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 10 గం॥ 30 ని॥ నుంచి ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 00 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 7 గం॥ 30 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 00 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 14 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 5 గం॥ 28 ని॥ లకు
check