Daily Horoscope 28/11/2021
ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు
28, నవంబర్ , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
కార్తీక మాసము
శరదృతువు
దక్షణాయనము
శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹
ఈ రోజుటి రాశిఫలాలు
28 నవంబర్ 2021
ఆదివారం NOVEMBER 28

మేషం
అశ్వని1,2,3,4,భరణి 1,2,3,4, కృతిక 1, ఇంట బయట శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది. ప్రయాణాలలో మరింత జాగ్రత్త వహించాలి.విద్యార్థులకు ధ్యేయం పట్ల ఏకాగ్రత, కొత్త విషయాల పట్ల ఆసక్తి ఏర్పడతాయి. ఉద్యోగస్తులకుపై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు తప్పవు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.
వృషభం
కృతిక 2,3,4,రోహిణి 1,2,3,4, మృగశిర1,2, కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.మీ సంతానం అత్యుత్సాహం ఇబ్బందులకు దారితీస్తుంది. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ఎప్పటి నుంచో అనుకుంటున్న మొక్కుబడులు తీర్చుకుంటారు. రాబడికి మించిన ఖర్చులు, చెల్లింపుల వల్ల స్వల్ప ఆటుపోట్లు తప్పవు. మీ ఆలోచనలు, కుటుంబ సమస్యలు గోప్యంగా ఉంచండి.ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి ఉపశమనం లభిస్తుంది.
మిథునం
మృగశిర 3,4, ఆరుద్ర 1,2,3,4, పున్వరసు1,2,3,
ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరం అవుతాయి.గృహ నిర్మాణ ఆలోచనలు వేగవంతం చేస్తారు
చిరు వ్యాపారులకు అన్ని విధాలా కలిసిరాగలదు. ప్రత్యర్థుల తీరు ఆందోళన కలిగిస్తుంది. కుటుంబ వాతావరణం మరింత చికాకు పరుస్తుంది.నూతన పెట్టుబడులు, లీజు, ఏజెన్సీలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు కోరుకున్న చోటికి బదిలీ, ప్రమోషన్ వంటి శుభ పరిణామాలున్నాయి.ఉద్యోగస్తులు అధికారులతో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి.కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.
కర్కాటకం
పున్వరసు 4,పుష్యమి 1,2,3,4, అశ్లేష 1,2,3,4,
కాంట్రాక్టర్లు, బిల్లర్లకు నిర్మాణ పనుల్లో ఏకాగ్రత ముఖ్యం. ప్రయాణాలు చికాకు పరుస్తాయి.ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. స్ధిరాస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. విద్యార్థులకు తోటివారి ధోరణి చికాకు పరుస్తుంది. రావలసిన ధనం అందటంతో ఆర్థికస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది.ఉద్యోగాలలో వివాదాలు మీ ఉన్నతిని చూసి కొంతమంది అపోహపడే ఆస్కారం ఉంది
సింహం
మఘ 1,2,3,4, పుబ్భ 1,2,3,4, ఉత్తర1, దూర ప్రాంతాల నుంచి కీలక నమాచారం అందుతుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సంతృప్తి పురోభివృద్ధి. విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. తొందరపాటు నిర్ణయాల వల్ల కష్టనష్టాలకు గురికావలసి వస్తుంది. స్ధిరాస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు.కళాకారులకు, రచయితలకు, అభిమాన బృందాలు అధికం కాగలవు. ఆస్తి పంపకాల విషయంలో పెద్దల నిర్ణయం నిరుత్సాహం కలిగిస్తుంది.ఆర్ధిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది.
కన్య
ఉత్తర2,3,4, హస్త 1,2,3,4,చిత్త 1,2, నూతన ఋణ ప్రయత్నాలు అంతగా కలిసిరావు. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు, ప్రణాళికలు సత్ఫలితాలిస్తాయి. నిరుద్యోగులకు ఉన్నత అవకాశములు లభిస్తాయి. కీలక వ్యవహారాలలో సలహాలు తీసుకోవడం మంచిది.ఉద్యోగమున ఉన్నతాధికారుల బెడదలు. మీ ఆంతరంగిక విషయాలు ఇతరుల ముందు ఏకరువు పెట్టటం మంచిది కాదని గమనించండి. అతిథి మర్యాదలు సమర్థంగా నిర్వహిస్తారు. స్త్రీలు అందరితోనూ కలుపుగోలుగా వ్యవహరిస్తారు. మిత్రుల హితోక్తులు మీపై మంచి ప్రభావం చూపుతాయి.
తుల
చిత్త 3,4, స్వాతి 1,2,3,4, విశాఖ1,2,3, నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో సఫలీకృతులవుతారు. వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు ఆశాజనకం. స్త్రీలకు ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. నూతన పరిచయాలేర్పడతాయి. భాగస్వామ్య వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి.నిత్యావసర వస్తు స్టాకిస్టులు, రేషన్ డీలర్లకు అధికారుల నుంచి వేధింపులు తప్పవు. ఖర్చులు, చెల్లింపులు ప్రయోజనకరంగా ఉంటాయి.చుట్టుపక్కల వారితో ఊహించని విభేదాలు .ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది.ఉద్యోగ ప్రయత్నాలు కొంత నిరాశ కలిగిస్తాయి.
వృశ్చికం
విశాఖ 4, అనురాధ 1,2,3,4,జ్యేష్ఠ 1,2,3,4, ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.ఆకస్మిక ధన లాభాలు పొందుతారు. .ఉభయల మధ్య అపోహలు తొలగి అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. దూర ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలించవు. ఖర్చులు అదుపు చేయాలన్న మీ యత్నం నెరవేరకపోగా ధనం మరింత వ్యయమవుతుంది.స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి.
ధనుస్సు
మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం చుట్టుపక్కల వారితో ఊహించని విభేదాలు . ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. మాటపట్టింపులుంటాయి ఇచ్చిపుచ్చుకునే వ్యవహరాలు, వాణిజ్య ఒప్పందాల్లో ఏకాగ్రత అవసరం. గృహంలో ఒక శుభకార్యానికి అనువైన వాతావరణం నెలకొంటుంది. టెక్నికల్, మెడికల్, ఇంజనీరింగ్ వంటి ఉన్నత కోర్సులలో అవకాశాలు లభిస్తాయి. మీ శ్రీమతి నుంచి అన్నివిధాలా ప్రోత్సాహం లభిస్తుంది. కార్యసాధనలో ఆటంకాలు అధికమిస్తారుకొన్ని విషయాలలో అందరితో సమస్యలు కలుగుతాయి.
మకరం
ఉత్తరషాఢ 2,3,4,శ్రవణం 1,2,3,4,ధనిష్ట 1,2, కుటుంబసభ్యులు నుండి వ్యతిరేకత పెరుగుతుంది మీ ఏమరుపాటుతనం వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. చిట్స్, ఫైనాన్సు రంగాల వారికి ఖాతాదారులతో సమస్యలు తప్పవు. కోర్టు వ్యవహారాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి అధికం.చుట్టుపక్కల వారితో ఊహించని విభేదాలు .ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. మాటపట్టింపులుంటాయి. ప్రయాణాలలో నూతన పరిచయాల వలన పలురకములుగాయాతన.
కుంభం
ధనిష్ట 3,4, శతభిషం 1,2,3,4, పూ||భా||1,2,3, కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు కలుగుతాయి
వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, స్టేషనరీ వ్యాపారులకు అన్ని విధాలా కలిసిరాగలదు. ఏ విషయంలోనుఅయినవారి మధ్య దాపరికం మంచిది కాదని గమనించండి. విదేశీయానం యత్నాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. మీ ఔన్నత్యాన్ని ఎదుటివారు గుర్తిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో స్వంత ఆలోచనలు పనిచేయవు. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు నిదానిస్తాయి.బ్యాంకింగ్ వ్యవహారాల్లోను, వాహనం నడుపుతున్నప్పుడు మెలకువ వహించండి.
మీనం
పూ||భాధ్ర||4,ఉ||భా||1,2,3,4,రేవతి1,2,3,4, దూర ప్రయాణాలలొ వాహన ఇబ్బందులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. మీ పై ఆధారపడిన వారి పట్ల విజ్ఞతాయుతంగా మెలగండి, సమస్యలు అవే సర్దుకుంటాయి. బిల్లులు చెల్లిస్తారు. కోర్టు వ్యవహరాలు వాయిదా కోరుకోవటం మంచిది. ప్రముఖుల సహకారంతో ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. ఆపత్సమయంలో సన్నిహితులకు అండగా నిలుస్తారు.సంతానం కొన్ని విషయాలలో మీతో విభేదిస్తారు.పాత ఋణముల ఒత్తిడి పెరుగుతుంది.
Panchangam
పంచాంగం
తేది : 28, నవంబర్ 2021
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : కార్తీకమాసం
ఋతువు : శరత్ ఋతువు
కాలము : వర్షాకాలం
వారము : ఆదివారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : నవమి
(నిన్న రాత్రి 12 గం॥ 11 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 11 గం॥ 58 ని॥ వరకు)
నక్షత్రం : పూర్వఫల్గుణి
(నిన్న సాయంత్రం 5 గం॥ 22 ని॥ నుంచి
ఈరోజు సాయంత్రం 5 గం॥ 43 ని॥ వరకు
వర్జ్యం : (ఈరోజు రాత్రి 12 గం॥ 52 ని॥ నుంచి ఈరోజు రాత్రి 2 గం॥ 27 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 52 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 40 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు సాయంత్రం 4 గం॥ 30 ని॥ నుంచి ఈరోజు రాత్రి 6 గం॥ 00 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు మద్యాహ్నం 3 గం॥ 00 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 30 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 00 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 30 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 14 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 5 గం॥ 20 ని॥ లకు