Daily Horoscope 03/11/2021 :

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

03, నవంబర్ , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
ఆశ్వయుజ మాసము
కృష్ణ చతుర్దశి
శరదృతువు
దక్షణాయనము సౌమ్య వాసరే
( బుధ వారం )

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

Daily Horoscope 03/11/2021
Daily Horoscope 03/11/2021

రాశి ఫలాలు

 మేషం

ఈరోజు
మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. మనోధైర్యంతో చేసే పనులు సిద్ధిస్తాయి. మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. గురుశ్లోకం చదవాలి. Daily Horoscope 03/11/2021

 వృషభం

ఈరోజు
సమయానుకూలంగా ముందుకు సాగాలి. ఆలోచనలే పెట్టుబడిగా లాభాలను అందుకుంటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవ సందర్శనం వల్ల మంచి జరుగుతుంది.

 మిధునం

ఈరోజు
శ్రమ కాస్త పెరుగుతుంది. మితంగా ఖర్చు చేయాలి. కుటుంబసభ్యులతో ప్రేమగా మెలగాలి. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. సమయానికి మంచి భోజనం తీసుకోవాలి. నవగ్రహ శ్లోకం చదవాలి.

 కర్కాటకం

ఈరోజు
మనస్సౌఖ్యం ఉంది. మీ మీ రంగాల్లో మంచి పేరు సంపాదిస్తారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆర్థికంగా ఎదుగుతారు. దుర్గాస్తుతిని పఠిస్తే బాగుంటుంది.

 సింహం

ఈరోజు
శుభ సమయం. కీలక వ్యవహారాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. మీ మీ రంగాల్లో స్పష్టమైన ఆలోచనలతో ముందుకు సాగి మంచి ఫలితాలు సాధిస్తారు. ఇష్టదైవ ధ్యానం శుభప్రదం.

 కన్య

ఈరోజు
తోటివారి సహాయ సహకారాలు ఉన్నాయి. ధనలాభం కలదు. శత్రువులు తగ్గుతారు. అభివృద్ధికి తోడ్పడే నిర్ణయాలు తీసుకునేటప్పుడు స్థిరచిత్తంతో వ్యవహరిస్తే శుభం చేకూరుతుంది. ప్రయాణ అనుకూలత ఉంది. కులదైవారాధన శుభప్రదం.

 తుల

ఈరోజు
ప్రారంభించిన పనులలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు.అలసట పెరుగుతుంది. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. ఒక సంఘటన మనస్తాపాన్ని కలిగిస్తుంది.మహాలక్ష్మి ధ్యానం శుభప్రదం.

 వృశ్చికం

ఈరోజు
మీ మీ రంగాల్లో సత్ఫలితాలు సాధిస్తారు. విజయావకాశాలు మెరుగవుతాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వచనాలు ఉంటాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం. Daily Horoscope 03/11/2021

ధనుస్సు

ఈరోజు
స్థిరమైన ఫలితాలను అందుకుంటారు. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. భోజన సౌఖ్యం కలదు. మనస్సౌఖ్యం ఉంది. ఆర్థికంగా శుభకాలం. గాయత్రీ మంత్రాన్ని జపించాలి.

 మకరం

ఈరోజు
ప్రారంభించబోయే పనుల్లో అలసట చెందకుండా చూసుకోవాలి. బంధుమిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని సందర్భాల్లో లౌక్యంగా వ్యవహరించి సమస్యలను అధిగమిస్తారు. నలుగురికీ ఉపయోగపడే పనులను చేసి తోటి వారి ప్రశంసలను అందుకుంటారు. గణపతి మంత్రం చదివితే మంచిది.

 కుంభం

ఈరోజు
మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఆశించిన ఫలితాలను రాబట్టడానికి ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. సమయపాలన పాటించండి. బలమైన ఆహారం,విశ్రాంతి అవసరం అవుతాయి. ప్రయాణాలలో ముందుచూపుతో వ్యవహరించాలి. శ్రీరామ నామాన్ని జపించండి.

 మీనం

ఈరోజు
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో శుభఫలితాలు ఉన్నాయి. నిర్ణీత సమయంలో పనులను పూర్తిచేస్తారు. సొంతింటి నిర్మాణ వ్యవహారానికి సంబంధించి ఒక ముందడుగు వేస్తారు. కొన్ని సంఘటనలు బాధ కలిగించినా చలించకుండా దృఢంగా ఉంటారు. కలహాలకు దూరంగా ఉండాలి. ఇష్టదైవారాధన వల్ల మంచి జరుగుతుంది. Daily Horoscope 03/11/2021

Panchangam

శ్రీ గురుభ్యోనమః
బుధవారం, నవంబర్ 3, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం – శరదృతువు
ఆశ్వయుజ మాసం – బహుళ పక్షం
తిథి:త్రయోదశి ఉ7.09వరకు తదుపరి చతుర్థశి తె5.24
వారం:బుధవారం (సౌమ్యవాసరే)
నక్షత్రం:హస్త ఉ9.08 తదుపరి చిత్ర
యోగం:విష్కంభం మ3.09 తదుపరి
కరణం:వణిజ ఉ7.09 తదుపరి భద్ర సా6.16 ఆ తదుపరి శకుని తె5.24
వర్జ్యం :సా4.48 – 6.19
దుర్ముహూర్తం:ఉ11.21 – 12.07
అమృతకాలం:రా2.00 – 3.32
రాహుకాలం:మ12.00 – 1.30
యమగండ/కేతుకాలం:ఉ7.30 – 9.00
సూర్యరాశి:తుల
చంద్రరాశి:కన్య
సూర్యోదయం:6.03 సూర్యాస్తమయం:5.26
నరకచతుర్థశి మాస శివరాత్రి

check Daily Horoscope 27/09/2021 :

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: