Govatsa Dwadashi :

Govatsa Dwadashi

Govatsa Dwadashi –

“సర్వతీర్ద మయీం దేవి వేదదేవాత్మికాం శివం
సురబిం యజ్ఞా స్య జననీ మాతరం త్వానమామ్యాహం”

పై శ్లోకాన్ని బట్టి సర్వ తీర్ధములు గోమాతలోనే ఉన్నాయని , వేదములన్నీ గోమాతలోనే ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు.

గోమాత సర్వ శుభ రూపిణివి. యజ్ఞమునకు తల్లివంటిదానిదని , ముప్పదిమూడు కోట్ల దేవతలకు నిలయం గోమాత.

గోవును పూజకు కొన్ని విశేషమైన పుణ్యతిథులున్నాయి. ఈ తిథుల్లో పూజించడం వల్ల విశేష ఫలితం దక్కుతుంది. అలాంటి పుణ్యతిథుల్లో ఒకటిగా ‘ఆశ్వయుజ బహుళ ద్వాదశి’ కనిపిస్తుంది.

దీనినే ‘గోవత్స ద్వాదశి’ అని కూడా అంటారు. ఈ రోజున దూడతో కూడిన గోవుని పూజించాలని పండితులు అంటున్నారు.

హిందూ సంప్రదాయంలో గోవును పూజించడం ఓ ఆచారం. దీనికి మన పురాణాల్లో ఎంతో విశిష్టత ఉన్నది. గోక్షీరం (ఆవుపాలు)లో చతుస్సముద్రాలుంటాయని పురాణాలు చెపుతున్నాయి.

సర్వాంగాలలో సమస్త భువనాలు దాగి ఉన్నాయని వేద పండితులు చెపుతుంటారు.

గోవులో వివిధ భాగాల్లో దాగివున్న వివిధ రకాల దేవదేవతుల వివరాలను ఓసారి పరిశీలిస్తే.. గోవు నుదురు , కొమ్ముల భాగంలో శివుడు కొలువుదీరి ఉంటాడట.

అందువల్ల కొమ్ములపై చల్లిన నీటిని సేవిస్తే త్రివేణి సంగమంలోని నీటిని శిరస్సు పై చల్లుకున్నంత ఫలితం లభిస్తుందని పురాణాలు చెపుతున్నాయి.

అంతేకాకుండా , శివ అష్టోత్తరం , సహస్రనామాలు పఠిస్తూ బిల్వ దళాలతో పూజిస్తే సాక్ష్యాత్ కాశీ విశ్వేశ్వరుడిని పూజించిన ఫలితం దక్కుతుందని వేద పండితులు చెబుతుంటారు.

గోవు నాసిక భాగంలో సుబ్రహ్మణ్యస్వామి ఉండటం వల్ల నాసికను పూజిస్తే సంతాన నష్టం ఉండదని , ఆవు చెవివద్ద అశ్వినీ దేవతలు కొలువై ఉంటారని వారు చెపుతారు. Govatsa Dwadashi

అందువల్ల చెవిని పూజిస్తే సమస్త రోగాల నుంచి విముక్తి కలుగుతుందట. ఆవు కన్నుల దగ్గర సూర్య , చంద్రులు ఉంటారనీ , వాటిని పూజించడం వల్ల అజ్ఞానమనే చీకటి నశించి జ్ఞానకాంతి , సకల సంపదలు కలుగుతాయని చెపుతున్నారు.

Govatsa Dwadashi
Govatsa Dwadashi

ఆవు నాలికపై వరుణ దేవుడు ఉండటం వల్ల అక్కడ పూజిస్తే శీఘ్ర సంతతి కలుగుతుందని చెపుతున్నారు.

అదేవిధంగా ఆవు సంకరంలో ఉన్న సరస్వతీదేవిని పూజిస్తే విద్యాప్రాప్తి. ఆవు చెక్కిళ్ళలో కుడి వైపున యముడు , ఎడమవైపున ధర్మదేవతలు ఉంటారని ప్రఘాడ విశ్వాసం.

కనుక వాటిని పూజిస్తే యమబాధలుండవని , పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని చెపుతారు. ఆవు పెదవుల్లో ప్రాతఃసంధ్యాది దేవతలుంటారట. వాటిని పూజిస్తే పాపాలు నశిస్తాయని పండితుల అభిప్రాయం.

ఆవు కంఠంలో ఇంద్రుడు ఉంటాడని , అందువల్ల కంఠం ను పూజిస్తే ఇంద్రియ పాఠవాలు , సంతానం కలుగుతుందట. ఆవు పొదుగులో నాలుగు పురుషార్థాలు ఉంటాయి.

కనుక ఆ చోట పూజిస్తే ధర్మార్థ , కామమోక్షాలు కలుగుతాయని చెపుతున్నారు. ఆవు గిట్టల చివర నాగదేవతలు ఉంటారట. వాటిని పూజిస్తే నాగలోక ప్రాప్తి లభిస్తుందని చెపుతున్నారు.

వాటితో పాటు భూమిపై నాగుపాముల భయం ఉండదట. ఆవు గిట్టల్లో గంధర్వులుంటారు. కనుక గిట్టలను పూజిస్తేగంధర్వలోక ప్రాప్తి. గిట్టల ప్రక్కన అప్సరసలుంటారు.

ఆ భాగాన్ని పూజిస్తే సఖ్యత , సౌందర్యం లభిస్తుందట. అందువల్ల గోమాతను సకల దేవతా స్వరూపంగా భావించి పూజిస్తుంటారు. గోమాత సర్వదేవతలు కొలువై వుంటారు.

అందుకే గోమాతను పూజిస్తే సకల దేవతలను పూజించినంత ఫలితం దక్కుతుందని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. యజ్ఞయాగాలను నిర్వహించే ప్రదేశాలను గోమయంతోనే శుద్ధి చేస్తుంటారు. Govatsa Dwadashi

కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్లు గోవుతో కలిసే గృహప్రవేశం చేయడం జరుగుతూ వుంటుంది. గోవు ప్రవేశిస్తే లక్ష్మీదేవి అడుగుపెట్టినట్టుగా భావిస్తుంటారు.

ఈ రోజున ఆవు దూడలను పసుపు కుంకుమలతో , పూల దండలతో అలంకరించి , భక్తి శ్రద్ధలతో ఆరాధించవలసి వుంటుంది. ఆవు పాలు , పెరుగు , నెయ్యితో చేసిన వంటకాలను ఈ రోజున స్వీకరించరాదనే నియమం ఉంది.

దూడతో కూడిన ఆవును పూజించిన వాళ్లు ఆ రోజున బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ నేలపై పడుకోవలసి వుంటుంది. ఈ నియమాలను పాటిస్తూ గోపూజ చేయడం వలన అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని పురోహితులు చెబుతున్నారు.

గోమాతను దానం చేస్తే కోటి పుణ్య ఫలం దక్కుతుందని పురోహితులు చెబుతున్నారు. గోమాత లక్ష్మీదేవి స్వరూపం. ఆవు పాలు ఎంతో శ్రేయస్కరం.

గోమాతను దానం చేయడం ద్వారా వెయ్యి అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యఫలం దక్కుతుంది. పశువులకు మేతను దానం చేస్తే పాపాలను హరిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

ఇంకా గోమాతను శుక్రవారం పూజిస్తే మీ ఇంట్లో సిరిసంపదలు వెల్లివెరుస్తాయి. ఇంట్లో గోపూజ చేయడం కుదరని పక్షంలో ఆలయాల్లోని గోశాలల్లో నిర్వహించే పూజల్లో పాల్గొనడం ద్వారా శుభఫలితాలుంటాయి.

శుభ ముహూర్త కాలంలో గోపూజ చేయించడం , గోమాతను ఆలయాలను దానంగా ఇవ్వడం వంటివి చేయడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పురోహితులు అంటున్నారు.

మాతృదేవత తర్వాత విశిష్టమైన ద్వితీయ స్థానాన్ని గోమాత వహించింది. గోమాత మనల్ని పోషిస్తున్నాయి.

పూర్వం బ్రహ్మన అచేతనాలైన నదులు , పర్వతాలు మొదలైనవాటిని సృష్టించి , జీవాత్మతో కూడిన చేతనమగు వస్తుజాతకమును అగ్నినుండి ఉత్పన్నం కావాలని సంకల్పించుకొని , అగ్నియందు ఉత్పత్తికి సాధకమగ హోమాన్ని చేశాడు.

శరీరం కొరరకు వాయువు , చక్షువు కొరకు ఆదిత్యుడు హోమం చేశారు. వారి హోమం వల్ల గోవు ఒక్కటే అందునుంచి ఆవిర్భవించింది.

గోవుకు వేద ప్రమాణమయిన విశిష్టత ఉంది. అగ్ని సంబంధమైన హోమం వల్ల , గోవు జన్మించడంవల్ల గోవు అగ్నిహోత్ర సమానమైంది.

కవ్వంచేత గో క్షీరాన్ని మధిస్తే వచ్చేటువంచి వెన్న , నెయ్యి దేవతలకు ప్రియమైనవి. గోదాన , హిరణ్య దానాలను యజ్ఞయాగాది క్రతువుల్లోనూ , పితృకర్మల్లోనూ చేయాలని మన శృతి బోధిస్తోంది.

గోవులున్న ఇల్లు , గ్రామం , రాష్ట్రం , దేశం సకల సౌభాగ్యాలతో విలసిల్లుతూ ఉంటుంది. పుణ్యఫలం లభిస్తుంది. ఆవుకు గో గ్రాసం సమర్పణ చేస్తే చక్కని సత్ఫలితాలు లభిస్తాయి.

పూజాకార్యక్రమాలు , వ్రతాలు , యజ్ఞాల్లో ఆవుపాలును శ్రేష్ఠమైందని అంటున్నారు. గోవు సమస్త సృష్టిలోకి పవిత్రమైంది. సకల దేవతలకి గోమాత నివాస స్థలం.

ఆవుపాలంటే సమస్త దేవతలనూ మన శుభకార్యానికి ఆహ్వానించినట్లవుతుంది. అందుకే మన ఇళ్ళల్లో జరిగే ప్రతి శుభకార్యానికి , వేడుకలు , యజ్ఞాలకు దేవతలను ఆహ్వానించే రీతిలో ఆవుపాలను వాడుతారని చెబుతున్నారు.

గంగి గోవు పాలు గరిటడైనను చాలు అని వేమన గారు శతకములో ప్రస్తుతించారు.

గోమాతను రక్షిద్దాము పూజిద్దాము సకలశుభాలను పొందుదాము.

check Organic Gardening At Home 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: