ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు
29, అక్టోబర్ , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
ఆశ్వయుజ మాసము
కృష్ణ అష్టమి
వర్ష ఋతువు
దక్షణాయనము భృగు వాసరే
( శుక్ర వారం )
శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

రాశి ఫలాలు
మేషం
ఈరోజు
ప్రారంభించిన కార్యక్రమాలకు ఆటంకాలు ఎదురవుతాయి. కొందరి ప్రవర్తన కాస్త బాధ కలిగిస్తుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కోపాన్ని కాస్త తగ్గించుకుంటే మంచిది. గోసేవ చేస్తే బాగుంటుంది.
వృషభం
ఈరోజు
మంచి ఆలోచనా విధానంతో అనుకున్నది సాధిస్తారు. నూతన కార్యక్రమాలను చేపడతారు. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. అనూహ్య ధనలాభం పొందుతారు. లక్ష్మీదేవిన ఆరాధిస్తే ఇంకా బాగుంటుంది.
మిధునం
ఈరోజు
మిశ్రమ కాలం. కష్టాన్ని నమ్ముకొని ముందుకు సాగండి. తిరుగులేని ఫలితాలను అందుకుంటారు. ఒకటీ రెండు ఆటంకాలు ఎదురైనా పెద్దగా ఇబ్బంది కలిగించవు. ప్రయాణాల్లో జాగ్రత్త. చంద్ర ధ్యానం శుభప్రదం.
కర్కాటకం
ఈరోజు
కీలక విషయాలలో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. సంతానాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. సుబ్రహ్మణ్య భుజంగస్తవం చదివితే బాగుంటుంది.
సింహం
ఈరోజు
పట్టు వదలకుండా పని చేసి అనుకున్నది సాధిస్తారు. అనవసరంగా కష్టాలను కొని తెచ్చుకుంటారు. కొన్ని పరిస్థితులు మనోవిచారాన్ని కలిగిస్తాయి. హనుమాన్ చాలీసా పఠనం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.
కన్య
ఈరోజు
సంతృప్తికరమైన ఫలితాలను రాబట్టడానికి ఇది సరైన సమయం. చేపట్టిన పనులలో పురోగతి ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. సౌభాగ్య సిద్ధి ఉంది. ఇష్టదేవతా స్తోత్రం పఠించడం మంచిది.
తుల
ఈరోజు
బుద్థిబలం బాగుంటుంది. సందర్భోచితంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చెప్పుడు మాటలను వినకండి. ప్రయాణాలలో ఆటంకాలు ఉంటాయి. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే మంచిది.
వృశ్చికం
ఈరోజు
శ్రమ ఫలిస్తుంది. ముఖ్య వ్యవహారాలలో పెద్దలను కలుస్తారు. నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి తగిన సహాయం చేసేవారు ఉంటారు.ఆంజనేయ స్తోత్రం పారాయణ చేస్తే మంచిది.
ధనుస్సు
ఈరోజు
అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. నూతన వస్తువులు కొంటారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. అష్టమ చంద్ర సంచారం అనుకూలంగా లేదు. సమయానికి నిద్రాహారాలు అవసరం. చంద్ర ధ్యానం శుభప్రదం.
మకరం
ఈరోజు
ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. శారీరక శ్రమ ఎక్కువవుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల తరవాత ఇబ్బందులు పడతారు. సుబ్రహ్మణ్య భుజంగ స్తవం పఠిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి.
కుంభం
ఈరోజు
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో మీకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. పట్టుదల వదలకండి. కలహ సూచన. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. దక్షిణామూర్తి స్తోత్రం చదివితే మంచిది.
మీనం
ఈరోజు
దైవబలం సంపూర్ణంగా ఉంది. మానవ ప్రయత్నం బలంగా చేయాలి. తరచూ నిర్ణయాలు మారుస్తూ ఇబ్బందులు పడతారు. స్థిరమైన బుద్ధితో ముందుకు సాగండి. దుర్గా అష్టోత్తరం చదవడం మంచిది.
Panchangam
శ్రీ గురుభ్యోనమః
శుక్రవారం, అక్టోబర్ 29, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం – శరదృతువు
ఆశ్వయుజ మాసం – బహుళ పక్షం
తిధి:అష్టమి ఉ9.00వరకు తదుపరి నవమి
వారం:శుక్రవారం (భృగువాసరే)
నక్షత్రం:పుష్యమి ఉ7.56 తదుపరి ఆశ్రేష
యోగం:శుభం రా11.20 తదుపరి శుక్లం
కరణం:కౌలువ ఉ9.00 తదుపరి తైతుల రా9.18 ఆ తదుపరి గరజి
వర్జ్యం:రా9.21 – 11.02
దుర్ముహూర్తం:ఉ8.29 – 9.15 &
మ12.20 – 1.07
అమృతకాలం: లేదు
రాహుకాలం:ఉ10.30 – 12.00
యమగండం/కేతుకాలం:మ3.00 – 4.30
సూర్యరాశి:తుల
చంద్రరాశి:కర్కాటకం
సూర్యోదయం:6.00 సూర్యాస్తమయం:5.30