Daily Horoscope 09/10/2021
ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు
09, అక్టోబర్ , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
ఆశ్వయుజ మాసము
శుక్ల్ చతుర్థి
శరదృతువు
దక్షణాయనము స్థిర వాసరే
( శని వారం )
శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

రాశి ఫలాలు
మేషం
ఈరోజు
శుభకాలం. దూరదృష్టితో ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. కీలక అంశాల్లో పెద్దలను సంప్రదించడం ఉత్తమం. రుణసమస్యలు తగ్గుతాయి. ఇష్టదైవాన్ని ప్రార్థిస్తే మంచిది.
వృషభం
ఈరోజు
మీ ధర్మం మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. మొహమాటం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆహార నియమాలను తప్పకుండా పాటించాలి. శ్రీ వేంకటేశ్వర స్వామిని సందర్శించడం మంచిది.
మిధునం
ఈరోజు
మీ మీ రంగాల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ.. వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. బంధుప్రీతి ఉంది. ఒక ముఖ్యమైన పనిలో కదలిక వస్తుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. గోసేవ చేయాలి.
కర్కాటకం
ఈరోజు
ఉత్సాహభరితమైన వాతావరణం ఉంటుంది. కొత్త బాధ్యతలను స్వీకరించే అవకాశం ఉంది. మానసికంగా ధృడంగా ఉంటారు. బంధువులతో సంతోషంగా గడుపుతారు. కీలక విషయాల్లో శుభపరిణామాలు చోటుచేసుకుంటాయి. దుర్గాదేవిని సందర్శిస్తే మంచిది.
సింహం
ఈరోజు
తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల వారికి మేలైన ఫలితాలుంటాయి. ఆర్థిక పరమైన విషయాల్లో మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.
కన్య
ఈరోజు
ముఖ్య విషయాల్లో పెద్దల ఆశీర్వచనాలు అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనవసర ధనవ్యయం సూచితం. అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బందిపెడతాయి. నవగ్రహ స్తోత్రం పారాయణ చేస్తే మంచిది.
తుల
ఈరోజు
తలపెట్టిన పనులు సులువుగా పూర్తవుతాయి. అవసరాలకు తగిన సహాయం అందుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆదిత్య హృదయ పారాయణ చేయడం మంచిది.
వృశ్చికం
ఈరోజు
అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులను ప్రణాళికతో పూర్తి చేయగలుగుతారు. చంద్ర ధ్యానాన్ని జపించాలి.
ధనుస్సు
ఈరోజు
మంచి కాలం. కీలక అంశాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. సూర్యాష్టకం చదివితే బాగుంటుంది.
మకరం
ఈరోజు
అనుకున్న పనులను అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. సమయానికి సాయం చేసేవారున్నారు. పెద్దల సహకారం లభిస్తుంది. నవగ్రహ స్తోత్రం చదివితే బాగుంటుంది.
కుంభం
ఈరోజు
చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురవకుండా జాగ్రత్త పడాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. సూర్యాష్టకము పఠిస్తే శుభఫలితాలు కలుగుతాయి.
మీనం
ఈరోజు
శ్రమ అధికమవుతుంది. అవసరానికి సాయం చేసేవారున్నారు. తోటివారి సహకారంతో ఆపదలు తొలుగుతాయి. ఇబ్బందులు కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. శివారాధన మంచిది.
Panchangam
తేది : 9, అక్టోబర్ 2021
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : ఆశ్వయుజమాసం
ఋతువు : శరత్ ఋతువు
కాలము : వర్షాకాలం
వారము : శనివారం
పక్షం : శుక్లపక్షం
తిథి : తదియ
(నిన్న మధ్యాహ్నం 1 గం॥ 31 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 11 గం॥ 17 ని॥ వరకు)
నక్షత్రం : విశాఖ
(నిన్న రాత్రి 10గం॥ 46 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 9 గం॥ 13 ని॥ వరకు)
వర్జ్యం : (ఈరోజు రాత్రి 12 గం॥ 56 ని॥ నుంచి ఈరోజు రాత్రి 2 గం॥ 25 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 5 గం॥ 54 ని॥ నుంచి ఈరోజు ఉదయం 7 గం॥ 30 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 9 గం॥ 00 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 30 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 6 గం॥ 00 ని॥ నుంచి ఈరోజు ఉదయం 7 గం॥ 30 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 30 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 00 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 54 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 5 గం॥ 41 ని॥ లకు