Today is Katyayani Devi Jayanti – ఈ రోజు కాత్యాయని దేవి జయంతి – ఈమె భాద్రపద బహుళ చుతుర్దశినాడు జన్మించెను . కాత్యాయని చంద్రహాసోజ్జ్వలకరా శార్దూలవరవాహనా కాత్యాయనీ శుభం దద్యాద్దేవీ దానవఘాతినీ దుర్గామాత యొక్క ఆఱవ స్వరూపనామము
కాత్యాయని , పూర్వము కత నామకుడైన ఒక ప్రసిద్ధ మహర్షి గలడు. అతని కుమారుడు కాత్య మహర్షి.
ఈ కాత్యగోత్రజుడే విశ్వవిఖ్యాతుడైన కాత్యాయన మహర్షి ఇతడు పరాంబా దేవిని ఉపాసించుచు పెక్కు సంవత్సరములు కఠినమైన తపస్సును ఆచరించెను.
దుర్గాదేవి (భగవతీదేవి) పుత్రికగా తన ఇంట జన్మింపవలెనని అతని కోరిక.
భగవతీ మాత ఆయన ప్రార్థనను అంగీకరించెను. కొంతకాలము పిమ్మట మహిషాసురుడు అను రాక్షసుని అత్యాచారములు భూలోకమున పెచ్చరిల్లెను.
ఈ మహిషాసురుని సంహరించుటకై బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ తమ తేజస్సుల అంశలతో ఒక దేవిని సృష్టించిరి.
మొట్టమొదట కాత్యాయన మహర్షి ఈమెను పూజించెను. అందువలన ఈమె కాత్యాయని అని ప్రసిద్ధికెక్కెను.

ఈమె కాత్యాయ మహర్షి ఇంట పుత్రికగా అవతరించినదని మరియొక కథయు గలదు.
ఈమె భాద్రపద బహుళ చుతుర్దశినాడు జన్మించెను (ఉత్తర భారత పంచాంగ సంప్రదాయమును అనుసరించి ఈ దినము ఆశ్వయుజ కృష్ణ చతుర్దశి).
ఈమె ఆశ్వయుజ శుక్లసప్తమి , అష్టమి , నవమి తిథుల యందు కాత్యాయన మహర్షి పూజలందుకొని విజయదశమినాడు మహిషాసురుని వధించెను.
కాత్యాయనీదేవి అమోఘఫలదాయిని. కృష్ణభగవానుని పతిగా బడయుటకు గోకులమునందలి గోపికలందరును యమునానదీ తీరమున ఈమెను పూజించిరి.
ఈమె వ్రజమండలమునకు (గోకులమునకు) అధిష్ఠాత్రిగా వెలసినది. ఈమె స్వరూపము దివ్యము భవ్యము.
ఈమె శరీరకాంతి బంగారమువలె తళతళ మెరయుచుండును. ఈమె నాలుగు భుజములతో విరాజిల్లుచుండును.
ఈమె కుడిచేతులలో ఒకటి అభయముద్రను , మరియొకటి వరముద్రను కలిగియుండును. ఈమె ఎడమచేతులలో ఒక దానియందు ఖడ్గము , వేరోక దానియందు పద్మము శోభిల్లుచుండును.
ఈమేకు సింహవాహనం. దుర్గానవరాత్రములలో ఆరవరోజున కాత్యాయనీ స్వరూపము పూజింపబడును.
ఆ దినమున సాధకుని మనస్సు ఆజ్ఞాచక్రము నందు స్థిరమగును. యోగసాధనలో ఈ ఆజ్ఞాచక్రము యొక్క స్థానము ప్రముఖమైనది.
కావున మనము అన్నివిధముల ఈ తల్లిని శరణుజొచ్చి , ఈమె పూజల యందును , ఉపాసనల యందును తత్పరులము కావలెను.
check Maghapuranam 3rd chapter
కాత్యాయనీ మంత్రాన్ని ఎన్ని సార్లు జపించాలి ?
LikeLike