Daily Horoscope 26/09/2021
ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు
26, సెప్టెంబరు , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
భాద్ర మాసము
కృష్ణ పంచమి
వర్ష ఋతువు
దక్షణాయనము భాను వాసరే
( ఆది వారం )
శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

రాశి ఫలాలు
మేషం
ఈరోజు
శారీరక శ్రమ పెరగకుండా చూసుకోవాలి. గతంలో పూర్తికాని ఒక పని ఇప్పుడు పూర్తవుతుంది. బలమైన ప్రయత్నంతో ధనలాభం ఉంది. దుర్గా శ్లోకం చదవండి. Daily Horoscope 26/09/2021
వృషభం
ఈరోజు
బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. అధికారుల సహాయంతో ఒక పని పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది.పెద్దల ఆశీర్వచనంతో సమస్యలు తగ్గుముఖం పడతాయి.
మిధునం
ఈరోజు
ఇష్టకార్యసిద్ధి ఉంది. ప్రశాంతమైన ఆలోచనలతో గొప్పవారవుతారు. మాట విలువను కాపాడుకోవాలి. ధనధాన్య లాభాలు ఉంటాయి. అవసరానికి ఆదుకునేవారు ఉంటారు. ఇష్టదైవారాధన వల్ల మంచి జరుగుతుంది.
కర్కాటకం
ఈరోజు
అంతా శుభమే జరుగుతుంది. తోటివారితో ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో కలిసి కీలక నిర్ణయాలను తీసుకుంటారు. స్థిరమైన నిర్ణయాలతో గొప్ప ఫలితాలను అందుకుంటారు. ఆర్థికంగా కలిసివచ్చే కాలం. ఇష్టదైవారాధన శుభప్రదం.
సింహం
ఈరోజు
మనస్సౌఖ్యం ఉంది. బుద్ధిబలం బాగుంటుంది. సందర్భోచితంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. విద్యవినోద సుఖం ఉంది. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే మంచిది.
కన్య
ఈరోజు
చేపట్టే పనుల్లో పట్టుదల అవసరం. కుటుంబ సభ్యులతో అభిప్రాయ బేధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఎవరితోనూ వాదోపవాదాలు చేయకండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. లక్ష్మీధ్యానం శుభప్రదం.
తుల
ఈరోజు
పనులకు అడ్డంకులు పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. దుర్గా అష్టోత్తర శతనామావళి చదవాలి.
వృశ్చికం
ఈరోజు
ప్రారంభించబోయే పనుల్లో శారీరక శ్రమ పెరగకుండా చూసుకోవాలి. మొహమాటం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రయాణాల్లో జాగ్రత్త. శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించడం మంచిది. Daily Horoscope 26/09/2021
ధనుస్సు
ఈరోజు
మీ మీ రంగాల్లో విజయావకాశాలు మెరుగవుతాయి. అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్పలితాలు సాధిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వచనాలు ఉంటాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.
మకరం
ఈరోజు
మనోబలాన్ని కోల్పోరాదు. మంచి పనులు చేపడతారు. అనవసర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ వాతావరణం అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. శారీరక శ్రమ పెరుగుతుంది. నవగ్రహ ధ్యానం శుభప్రదం.
కుంభం
ఈరోజు
కీలకమైన పనులను ప్రారంభిస్తారు. మీ ధర్మం మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. మొహమాటం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆహార నియమాలను పాటించాలి. శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించడం మంచిది.
మీనం
ఈరోజు
మీ అభివృద్ధికి దోహదపడే ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు. తరచూ నిర్ణయాలు మారుస్తూ ఇబ్బందులు పడతారు. స్థిరమైన బుద్ధితో ముందుకు సాగండి. కుటుంబంలో సమస్యలు రాకుండా జాగ్రత్తపడాలి. దుర్గా అష్టోత్తరం చదవడం మంచిది. Daily Horoscope 26/09/2021
panchangam
పంచాంగం
తేది : 26, సెప్టెంబర్ 2021
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : భాద్రపదమాసం
ఋతువు : వర్ష ఋతువు
కాలము : వర్షాకాలం
వారము : ఆదివారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : పంచమి
(నిన్న ఉదయం 8 గం॥ 41 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 10 గం॥ 39 ని॥ వరకు)
నక్షత్రం : కృత్తిక
(నిన్న ఉదయం 10 గం॥ 58 ని॥ నుంచి
ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 29 ని॥ వరకు
వర్జ్యం : (ఈరోజు లేదు
అమ్రుతఘడియలు : (ఈరోజు ఉదయం 10 గం॥ 52 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 12 గం॥ 38 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు సాయంత్రం 4 గం॥ 17 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 5 గం॥ 5 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు సాయంత్రం 4 గం॥ 30 ని॥ నుంచి ఈరోజు రాత్రి 6 గం॥ 00 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 00 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 30 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 00 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 30 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 52 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 5 గం॥ 54 ని॥ లకు