History of Sri Venkateswara Swamy

History of Sri Venkateswara Swamy

History of Sri Venkateswara Swamy శ్రీహరి శ్వేతవరాహ రూపము ధరించిన వృత్తాంతము

పూర్వకాలమందు ఒకానొకనాడు సనకసనందనాదులు వైకుంఠానికి బయలుదేరారు. శ్రీమహావిష్ణువు యొక్క దివ్యమంగళ స్వరూప దర్శనమునకై వారు వెడలసాగిరి.

సనకసనందనాదులు మహాభక్తులు నిరంతరము విష్ణుకధా శ్రవణాసక్తులు భగవత్ దైవానురాగానురక్తులు.

ద్వారపాలకులు వారిని లోనికి వెడలుటకు అభ్యంతరము తెలిపిరి. వారు ‘‘మేము చాలా ముఖ్యులము, లోనికి వెడలి తీరవలసినదే’’ అనిరి.

‘‘ససేమిరా లోపలికి వెడలుటకు వీలు లేనేలేదన్నారు.’’ ఆ యిరువు ద్వారపాలకులూను.

మునులు కోపము శాపమునకు దారి తీయును గదా! వారిద్దరూ ద్వారపాలులవైపు తీవ్రముగా చూచి మీకింత కండ కావరమా! మమ్ములను శ్రీమహావిష్ణువును దర్శించకుండ చేతురా? చూచుకొనుడు మా శక్తి! మీరిద్దరూ రాక్షసులై పోయెదురుగాక అని శాపమిచ్చినారు. ద్వారపాలకులు కంపించినారు.

ఇదేమి శాపమని విలపించి తమ్ము క్షమించవలసినది వారిని కోరారు.

అంతట మునులు కొంత అనుగ్రహించి మూడు జన్మలందు మీరు రాక్షసులుగ నుండి శ్రీమహావిష్ణువునకు శతృవులుగా వ్యవహరించిన పిదప మరల మీ పూర్వస్థానములను పొంది శ్రీమహావిష్ణువును కొలువగలరు అనగా ఆ ద్వారపాలక భక్తులు అందుకు అంగీకరించిరి.

తరువాత వారు తొలిజన్మగా హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా జన్మించిరి.

హిరణ్యాక్షుడు పరమ దుర్మార్గుడు. అడ్డూ అదుపూ లేక అతడు చెడు పనులు చేసేవాడు, ఒకసారి భూమండలము యావత్తు చాపగా చుట్టేసి దానిని రసాతల లోకానికి తీసుకునిపోయి దాచేశాడు. దేవతలు ఈ విపత్తును చూచి వెంటనే శ్రీమహావిష్ణువు వద్దకు వెడలి ప్రార్థించారు. History of Sri Venkateswara Swamy

అభయమిచ్చాడు నారాయణుడు, తాను శ్వేతవరాహ రూపము ధరించాడు. హిరణ్యాక్షుని సంహరించాడు. బ్రహ్మ మున్నగువారు శ్వేత వరాహమును మనసారా స్తుతించారు.

భూమండలాన్ని రక్షించిన నీవు భూలోకములోనే వుండవలసినదిగా కోరుతున్నామన్నారు.

శ్వేతవరాహస్వామి సరేనని తనకు నివాసస్థలముగా శేషాచలాన్ని ఎన్నుకొని అక్కడ ఉండసాగాడు.

వరాహ స్వామికి చాలమంది భక్తులేర్పడిరి. అందులో వకుళాదేవి ముఖ్యురాలు.

వకుళాదేవి కథ

అది ద్వాపర యుగము. శ్రీకృష్ణ పరమాత్మ తన అవతారమును చాలించే సమయము ఆసన్నమవుతున్నది. ద్వారకావాసులా సంగతి తెలుసుకొని విచార సాగరములో మునిగిపోయారు.

వారు శ్రీకృష్ణుని చెంతకేగి స్వామీ! నిన్ను వదలి మేము ఏ విధముగా నుండగలము? ఉండలేము అనిరి. శ్రీకృష్ణుడు ఓదార్చి కలియుగమందు మీరందరూ నన్ను ధ్యానించి నాయందు చేరుటకు అవకాశమున్నది’ అని వారిని పంపించినాడు.

యశోద కోరిక

యశోద శ్రీకృష్ణుని కంటికి రెప్పగా చూచుకొని పెంచినది. తన ప్రాణమే కృష్ణుడుగ ఆమె భావించుచుండెను. ముద్దుల శ్రీకృష్ణుని యెడల ఆమె మధురానురాగము మరి ఎవ్వరునూ చూపి యుండలేదు. శ్రీకృష్ణునకున్నూ యశోద అంటే అనుపమానమయిన ప్రేమ.

శ్రీకృష్ణుడు అవతారము చాలించునున్నాడనే విషయము యశోదకి కూడా తెలిసింది.

ఆమె శ్రీకృష్ణుని పిలచి ‘‘నాయనా! కృష్ణా! నీ వలన నాకు యెన్నో విధముల ఆనందము చేకూరినది. కానీ నాకు ఒక్కలోటు మాత్రము యింకనూ వున్నది. నీకు జరిగిన వివాహములలో ఒకదానిని కూడ చూడడం నాకు వీలుపడలేదు. నీ వివాహం చూడాలనే కోరిక నాలో వుండిపోయింది’’ అని యన్నది,

శ్రీకృష్ణుడు ‘‘అమ్మా! నీ కోరిక కలియుగములో తీరగలదు. శ్రీవేంకటేశ్వర అవతారమును కలియుగమున దాల్చెదను.

నీవిక యీ శరీరమును వీడి వకుళ మాలికవై శేషాచలమునకు వెళ్ళి వరాహస్వామిని అర్చిస్తూవుండు అన్నాడు. ఆమె అట్లే యన్నది.

ఆ యశోద శరీరమును వీడి వకుళాదేవిగా మారింది.
శేషాచలము చెంతనుండే వరాహస్వామిని అర్చించసాగింది. యామె మనస్సు వెన్న. మహాభక్తురాలు

శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-15

శ్రీమన్నారాయణుడు వరాహస్వామిని దర్శించుట

శ్రీమన్నారాయణుని తలకు గాయము తగిలినది కదా! అందువలన ఔషధమునకై అతడు శోధించుచుండెను. బృహస్పతికి ఆ విషయము తెలిసి శేషాచలానికి వెళ్ళి ‘మేడి చెట్టు పాలల్లో జిల్లేడు పత్తిని తడిపి, నీవు ఈ గాయము పై పట్టు వెయ్యాలి’ అని నారాయణునితో చెప్పి వెళ్ళిపోయాడు. History of Sri Venkateswara Swamy

మందు తయారు చేసికొనుటకై అతడు వస్తువుల గురించి కొండ పై నున్న అరణ్యము అంతా వెదకుచుండగా వరాహస్వామి ఆశ్రమముకనిపించినది.

ఆశ్రమములోనికి ప్రవేశించాడు. వరాహస్వామి నారాయణుని గుర్తించి సకల మర్యాదలు చేశాడు.

వరాహస్వామి నారాయణుని ‘‘తాము సర్వ సంపదలు వీడి భూలోకమునకు యేల వచ్చితిరి. అని ప్రశ్నించాడు.

నారాయణుడు భృగువు వైకుంఠానికి రావడము నుండి భూలోకములో తాను పుట్టలోనుండగా పశువుల కాపరి తనను గండ్రగొడ్డలితో తల పై కొట్టడము వరకూ పూసగ్రుచ్చినట్లు చెప్పాడు.

నారాయణుడు తాను శేషాచలము పై నివసించ యిష్టపడుతున్నానని, కనుక ఆ పర్వతము పై తనకు కొంత స్థలము ఈయవలసిందని అడిగాడు.

వరాహస్వామి క్రయధనము యిస్తే స్థలము ఇస్తానన్నాడు. శ్రీమన్నారయణుడు ప్రస్తుతం మేరు (పర్వతము) కలవారు,

నేను సిరిలేని వాడను, నాకు మీరు స్థలము కనుక యిస్తే నాకు అనేకమంది భక్తులు వచ్చి కానుకలూ అవీ అర్పిస్తుంటారు.

అలా వారు నాకొరకై వచ్చినప్పుడు మొట్టమొదట మిమ్ములనే దర్శించి మీకు కానుకలు యిచ్చి నా వద్దకు వచ్చే ఏర్పాటు చేసెదను అనగా,

వరాహస్వామి అంగీకరించి నూరు అడుగుల స్థలాన్ని కొండ పై శ్రీమన్నారాయణునకిచ్చాడు. ఇచ్చి ‘‘నా వద్ద వకుళాదేవి అనే మహాభక్తురాలున్నది. ఆమెను నీ వెంట పెట్టుకొనుము.

History of Sri Venkateswara Swamy
History of Sri Venkateswara Swamy

ఆమె నీకు అన్ని విధాల సేవలు చేయుచుండును’’ అని వకుళాదేవిని శ్రీహరికి వప్పజెప్పెను.

వకుళాదేవి శ్రీహరి చరిత్రను వినుట

శ్రీహరి ఒక పర్ణశాలను నిర్మించుకొన్నాడు. దానిలో తానున్నూ వకుళాదేవియు నివసింపసాగిరి. ఒకనాడు వకుళ, ‘నాయనా! అసలు నీ వృత్తాంతమేమిటి?’ అని ప్రశ్నించగా, నారాయణుడు తనకు – నా – అనువారెవరూ లేరు అనియునూ, తల పై గాయము విషయమున్నూ చెప్పినాడు. వకుళ తన విషయమూ చెప్పినది. History of Sri Venkateswara Swamy

శ్రీహరి శ్రీనివాసుడగుట

వకుళ వనమూలికలూ అవీ తెచ్చి నారాయణుని తల పై గల గాయము పై మందువేసినది. పళ్ళూ అవీ తెచ్చి ఆహారము యిచ్చినది. వకుళ నారాయణుని శ్రీనివాసాయని పిలచి పరమానంద మొందేది.

నారాయణుడు అంతటి నుండి శ్రీనివాసుడుగ వ్యవహరింపబడేవాడు.

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: