Daily Horoscope 13/06/2021
ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు
13, జూన్ , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
జ్యేష్ఠమాసము
గ్రీష్మ ఋతువు
ఉత్తరాయణము భాను వాసరే
( ఆది వారం )
శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹
రాశి ఫలాలు
మేషం
ముఖ్య విషయాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు. అనవసర ఖర్చులను అదుపు చేయండి. లక్ష్మీధ్యానం శుభప్రదం. Daily Horoscope 13/06/2021
వృషభం
ప్రణాళికలను అమలు చేసే దిశగా ముందుకు సాగండి. బలమైన ఆహారాన్ని తీసుకోవాలి. శత్రువుల జోలికి పోరాదు. వృథా ప్రయాణాల వల్ల నిరుత్సాహం కలుగుతుంది. దుర్గారాధన వల్ల మేలు జరుగుతుంది.
మిధునం
కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. జన్మరాశిలో చంద్రుడు అనుకూల ఫలితాలను ఇస్తున్నారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఇష్టదేవతా స్తుతి మంచిది.
కర్కాటకం
కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. పొదుపు పాటించాలి. స్థానచలనం సూచితం. కీలక వ్యవహారాల్లో ఓర్పుగా వ్యవహరించండి. శివనామాన్ని జపించాలి. Daily Horoscope 13/06/2021
సింహం
విజయావకాశాలు మెరుగవుతాయి. శత్రువులపై మీదే పైచేయి అవుతుంది. ఆర్థిక వ్యవహారాలలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇష్టదైవ నామస్మరణ మంచిది.
కన్య
మానసికంగా దృఢంగా ఉంటారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మీ పట్ల అధికారుల వైఖరి మిశ్రమంగా ఉంటుంది. ఆంజనేయ దర్శనం మంచిది.
⚖ తుల
ఉద్యోగంలో పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులు మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. మీ నిజాయతీ మిమ్మల్ని కాపాడుతుంది. శివనామాన్ని జపించాలి.
వృశ్చికం
అవసరానికి తగిన సహాయం అందుతుంది. మనోబలంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. బంధుమిత్రులతో కలిసి కీలక నిర్ణ్రయాలు తీసుకుంటారు. భోజన సౌఖ్యం కలదు.
ఇష్టదైవారాధన శుభప్రదం.
ధనుస్సు
మంచి శుభకాలం ఉంది. మీ మీ రంగాల్లో శుభఫలితాలు ఉన్నాయి. గ్రహబలం అనుకూలిస్తోంది. విశేషమైన ఆర్థిక ఫలితాలు ఉన్నాయి. ఊహించిన దాని కన్నా ఎక్కువ ఫలితాలు ఉంటాయి. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఆర్థికంగా అనుకూలమైన కాలం. ఆస్తిని వృద్ధి చేస్త్తారు. గృహయోగం శుభప్రదం. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. ప్రశాంతమైన జీవితం ఏర్పడుతుంది. ఈశ్వర ఆరాధన ఉత్తమం.
మకరం
కార్యక్రమాలు ఫలిస్తాయి. కీలక విషయాల్లో మనోధైర్యంతో ముందుకు సాగితే ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. ఆర్థికంగా ఎదుగుతారు. నూతన ఆలోచనలతో మంచి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అధికారుల వల్ల మేలు జరుగుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఉత్సాహంగా ఉంటారు. చిన్న చిన్న ఇబ్బందులున్నా అవి మీ అభివృద్ధికి అడ్డురావు. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు సిద్ధిస్తాయి. ఆధ్యాత్మికంగా శుభకాలం. ప్రశాంత జీవితం ఏర్పడుతుంది. ఒత్తిళ్లు తగ్గుతాయి. విష్ణు ఆరాధన శుభప్రదం.
కుంభం
అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. మీ భుజాన కొత్త బాధ్యతలు పడతాయి. వాటిని సక్రమంగా నిర్వర్తిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే బాగుంటుంది.
మీనం
ఒక శుభవార్త వింటారు. ఒక వ్యవహారంలో మీకు సహాయం అందుతుంది. కీలక విషయాల్లో చురుగ్గా పనిచేస్తారు. మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ముఖ్య విషయాల్లో నిర్లక్ష్యం చేయకండి. Daily Horoscope 13/06/2021
panchangam
శ్రీ గురుభ్యోనమః
ఆదివారం, జూన్ 13, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
ఉత్తరాయణం – గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం – శుక్ల పక్షం
తిధి:తదియ రా7.08తదుపరి చవితి
వారం:ఆదివారం (భానువాసరే)
నక్షత్రం:పునర్వసు సా5.12 తదుపరి పుష్యమి
యోగం:వృద్ధి ఉ8.30 తదుపరి ధృవం
కరణం:తైతుల ఉ6.41 తదుపరి గరజి రా7.08 ఆ తదుపరి వణిజ
వర్జ్యం:ఉ.శే.వ6.05వరకు &
రా1.34 – 3.15
దుర్ముహూర్తం :సా4.46 – .38
అమృతకాలం: మ2.38 – 4.20
రాహుకాలం :సా4.30 – 6.00
యమగండం/కేతుకాలం:మ12.00 – 1.30
సూర్యరాశి:వృషభం
చంద్రరాశి: మిథునం
సూర్యోదయం:5.29
సూర్యాస్తమయం:6.31
సర్వేజనా సుఖినోభవంతు Daily Horoscope 13/06/2021
check other posts